
'మా పవర్ వాళ్లకు తెలుసు'
పనాజీ: బీహార్లో తమ పార్టీకి ఎలాంటి బాధ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తమ పార్టీకి అనుకూల వాతావరణం మెండుగా ఉందని చెప్పారు. ముఖ్యంగా తమ ప్రత్యర్థులు అయిన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపినప్పటి నుంచి తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగైందని చెప్పారు. 'బీహార్లో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని నేను నమ్ముతున్నాను. 25 ఏళ్లుగా నీకా నాకా అంటూ ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేసిన నేతలు నేడు ఒకే వేదికపై ఉన్నారు. కానీ, బీజేపీ చాలా శక్తిమంతమైనదని వారు గుర్తించి చేతులు కలిపారు' అని అమిత్ షా అన్నారు.