
'నేను దెయ్యం అయితే.. మోదీ బ్రహ్మ పిశాచి'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల వ్యక్తిగత దూషణలు శృతిమించిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను దెయ్యమని విమర్శించడంపై లాలూ తీవ్రంగా స్పందించారు. తాను దెయ్యం అయితే మోదీ బ్రహ్మ పిశాచి అని లాలూ అన్నారు.
'నేను దెయ్యం అయితే మోదీ నిజమైన బ్రహ్మ పిశాచి. దళితులకు, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆర్ఎస్ఎస్-బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నందుకే నన్ను విమర్శిస్తున్నారు' అని లాలూ అన్నారు. మోదీ తనను విమర్శించడం ద్వారా యాదవులందరినీ కించపరిచారని వ్యాఖ్యానించారు. మోదీకి ప్రధాని కావాల్సిన అర్హత లేదని విమర్శించారు.