'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ' | Would be happy if Nitish becomes PM: Tejaswi | Sakshi
Sakshi News home page

'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'

Published Sun, Sep 18 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'

'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు తమ మద్దతు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఉంటుందని డిప్యూటీ సీఎం ఆర్జేడీ అధినేత తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఆయన ప్రతిపక్షాల తరుపు నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చినా తమకు సంతోషమే అని, తన తండ్రి లాలూ కూడా దీనికి సమ్మతంగా ఉన్నారని ఆయన చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కానీ, నితీశ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మారితే అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిస్తుంది' అని అన్నాడు.

ప్రధాని నరేంద్రమోదీకంటే కూడా సీఎం నితీశ్ ప్రధానిగా చాలా సమర్థులు అని, ఆయన నిజంగా ఓ ప్రధాని హోదాకు తగిన అర్హుడని తేజస్వి చెప్పాడు. 2019 ఎన్నికల్లో మాత్రం మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా గెలవలేరు అని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ తనకు ఓ రాజకీయ గురువు అని గౌరవాన్ని చాటుకున్నాడు. అంతకుముందు లాలు ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థినా కాదా అనే విషయం తనకు తెలియదని, కానీ.. నితీశ్ మాత్రం ప్రధాని పదవి అలంకరించేందుకు తగిన ముడిసరుకుకలవాడని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement