లాలు ముఖంలో 'లాంతరు' వెలుగు | lantern gives lighting to lalu prasad yadav | Sakshi
Sakshi News home page

లాలు ముఖంలో 'లాంతరు' వెలుగు

Published Sun, Nov 8 2015 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

లాలు ముఖంలో 'లాంతరు' వెలుగు

లాలు ముఖంలో 'లాంతరు' వెలుగు

పట్నా: ఆర్జేడీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ముఖంలో 'లాంతరు' వెలుగులు నింపింది.  లాంతరు గుర్తుతో లాలు ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే.  బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఆర్జేడీ వంద స్థానాలకు, జేడీయూ మరో వంద స్థానాలకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకు పోటీ చేసింది.

 

ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం మహాకూటమి 161, ఎన్డీయే 72, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. స్పష్టమైన మెజార్టీతో మహాకూటమి దూసుకు పోతోంది. ఎన్డీయే కూటమి వందలోపు స్థానాలతోనే సరిపెట్టుకునేలా ఉంది. మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో పట్నాలో సంబరాలు మిన్నంటుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement