
లాలు ప్రసాద్ అరెస్టు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. కులాల ఆధారంగా జరిగిన జనాభా లెక్కలను బహిరంగ పరచడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఒకరోజు రాష్ట్రబంద్ నిర్వహించాలని లాలు పిలుపునిచ్చారు. ఈ బంద్ సందర్భంగానే లాలును అరెస్టుచేశారు. పట్నాలోని డాక్ బంగ్లా క్రాసింగ్ వద్ద లాలును అరెస్టు చేశామని, ఆయనతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మద్దతుదారులను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
బీహార్ మిలటరీ పోలీస్ క్యాంప్ వద్దగల తాత్కాలిక శిబిరానికి లాలును తరలించారు. మండల్ (వెనకబడిన తరగతుల వాళ్లు) కమండలాన్ని (బీజేపీ) కూకటివేళ్లతో పెకలించాలని లాలు అంతకుముందు పిలుపునిచ్చారు. ఈ లెక్కలను వెంటనే బయటపెట్టకపోతే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1990ల నాటి మండల్ ఉద్యమం కంటే మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆర్జేడీ బంద్ కారణంగా బీహార్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.