'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా' | Lalu Prasad accepts his pressure led to MLA Anant Singh's arrest | Sakshi
Sakshi News home page

'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా'

Published Thu, Jun 25 2015 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా'

'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా'

పాట్నా: హత్యారోపణలు ఎదుర్కొంటున్న జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్ట్ చేయించింది తానేనని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అంగీకరించారు. తన ఒత్తిడి మేరకే పోలీసులు సింగ్ ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ' నేను ఒత్తిడి చేయడంతోనే సింగ్ ను అరెస్ట్ చేశారు. మీ చేతుల్లోంచి ఎవరైనా మీ బిడ్డను తీసుకుని పారిపోతే ఏం చేస్తారు. జర్నలిస్టుపై దాడి చేస్తే ఏం చేస్తారు. నేనూ అదే చేశాను. సింగ్ లాంటి వ్యక్తులు సమాజంలోని సామరస్యాన్ని చెడగొడతార'ని లాలు యాదవ్ అన్నారు.

ఆర్జేడీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. అనంత్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు సాగిస్తున్న హింసాకాండ ఆమోయోగ్యం కాదన్నారు. ఇటువంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. కాగా, అనంత్ సింగ్ తో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే ఆయనను లాలు అరెస్ట్ చేయించారన్న  ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement