Anant Singh
-
బాహుబలి జైలులో ఉండి గెలిచాడు
పట్నా: ఒకప్పుడు జేడీయూ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి పలు నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లి ఆ పార్టీని వదిలేసిన అనంత సింగ్(బాహుబలి) అలియాస్ చోటే సర్కార్ తిరిగి మరోసారి తన సత్తా చాటాడు. ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనకుండా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. జైలు ఉండే తన హవా చూపించాడు. తిరిగి అదే జేడీయూ పార్టీకి చెందిన అభ్యర్థిని మట్టకరిపించాడు. 2005, 2010లో జేడీయూ టికెట్ పై అనంత సింగ్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో జైలు పాలయ్యాడు. దీంతో అతడు పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని చాలా నెలలుగా జైలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో తిరిగి ఒకప్పుడు తాను బరిలోకి దిగిన మోకామా నంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇదే స్థానంలో జేడీయూ తరుఫున బరిలో నిలిచిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్కు ఓటమి రుచి చూపించాడు. మొత్తం 18,348 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ సింగ్ కు 54,005 ఓట్లు పోలవ్వగా.. జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 35,657 ఓట్లు లభించాయి. -
కటకటాల్లోంచి ఎన్నికల బరిలోకి..
పాట్నా: బిహార్లో ఓ ఎమ్మెల్యే జైల్లో ఉంటూనే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అభిమానులు 'చోటె సర్కార్'గా పిలుచుకునే ఎమ్మెల్యే అనంత్ సింగ్ను గత జూన్లో కిడ్నాప్, హత్య కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో అనంత్ సింగ్.. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ నెల 7న ఆయన నామినేషన్ వేయనున్నట్టు అనుచరులు చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా అనంత్ సింగ్ డబ్బు, కండబలంతో బిహార్ రాజకీయాలను శాసిస్తున్నారు. మొన్నటివరకు అధికార జేడీయూలో ఉన్న అనంత్ సింగ్.. పార్టీ టికెట్ నిరాకరించడంతో రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఐదు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. -
'ఆ ఎమ్మెల్యేను నేనే అరెస్ట్ చేయించా'
పాట్నా: హత్యారోపణలు ఎదుర్కొంటున్న జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్ట్ చేయించింది తానేనని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అంగీకరించారు. తన ఒత్తిడి మేరకే పోలీసులు సింగ్ ను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ' నేను ఒత్తిడి చేయడంతోనే సింగ్ ను అరెస్ట్ చేశారు. మీ చేతుల్లోంచి ఎవరైనా మీ బిడ్డను తీసుకుని పారిపోతే ఏం చేస్తారు. జర్నలిస్టుపై దాడి చేస్తే ఏం చేస్తారు. నేనూ అదే చేశాను. సింగ్ లాంటి వ్యక్తులు సమాజంలోని సామరస్యాన్ని చెడగొడతార'ని లాలు యాదవ్ అన్నారు. ఆర్జేడీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. అనంత్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు సాగిస్తున్న హింసాకాండ ఆమోయోగ్యం కాదన్నారు. ఇటువంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. కాగా, అనంత్ సింగ్ తో ఉన్న ఆధిపత్య పోరు కారణంగానే ఆయనను లాలు అరెస్ట్ చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.