కటకటాల్లోంచి ఎన్నికల బరిలోకి..
పాట్నా: బిహార్లో ఓ ఎమ్మెల్యే జైల్లో ఉంటూనే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అభిమానులు 'చోటె సర్కార్'గా పిలుచుకునే ఎమ్మెల్యే అనంత్ సింగ్ను గత జూన్లో కిడ్నాప్, హత్య కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో అనంత్ సింగ్.. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ నెల 7న ఆయన నామినేషన్ వేయనున్నట్టు అనుచరులు చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా అనంత్ సింగ్ డబ్బు, కండబలంతో బిహార్ రాజకీయాలను శాసిస్తున్నారు. మొన్నటివరకు అధికార జేడీయూలో ఉన్న అనంత్ సింగ్.. పార్టీ టికెట్ నిరాకరించడంతో రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఐదు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.