
నితీష్ కుమార్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, పాట్నా : బిహార్ శాసన మండలి ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, హోంమంత్రి మంగళ్ పాండే, మాజీ సీఎం రబ్రీదేవి సహా పలువురు ప్రముఖులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. మొత్తం 11 స్ధానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులంతా పోటీ లేకుండా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే అభ్యర్థి ప్రేమ్‌చంద్ మిశ్రాను బరిలో దింపగా, బీజేపీ తరపున సంజయ్ పాశ్వాన్, సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండేలు పోటీలో నిలిచారు. జేడీ(యూ) నుంచి నితీష్ కుమార్, రామేశ్వర్ మహతో, ఖలీద్ అన్వర్ పోటీ చేశారు.
ఆర్‌జేడీడీ నుంచి రబ్రీదేవి, రామచంద్ర పుర్వే, సయ్యద్ ఖుర్షీద్ మెహసీన్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీ బరిలో నిలిచారు. ముఖ్యమంత్రిగా మూడోసారి నితీష్ కుమార్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. బిహార్‌లో మండలి సభ్యుడిగా సీఎం పదవికి ఎంపికైన తొలినేత నితీష్ కుమార్ కావడం గమనార్హం. ఎన్నికైన ఎమ్మెల్సీల్లో సంజయ్ పాశ్వాన్, ప్రేమ్‌చంద్ మిశ్రా, రామేశ్వర్ మహతో, ఖలీద్ అన్వర్, సయ్యద్ ఖుర్షీద్ మొహసీన్, సంతోష్ కుమార్ సుమన్ కొత్త ముఖాలు.
Comments
Please login to add a commentAdd a comment