
రబ్రీ ఆస్తులు రూ. 6.5కోట్లు
పాట్నా: పశువులు 65, ఒక డబుల్ బేరల్ తుపాకీ, 50 కాట్రిడ్జులు... ఇవన్నీ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆస్తుల్లో భాగం. తనకు రూ. 6.5కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
బీహార్‌లోని శరణ్ లోక్‌సభ నియోజవకర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే అవకాశమున్న నాలుగు కేసులను ఎదుర్కొంటున్నట్లు, వాటిపై కోర్టులో అభియోగాలు కూడా నమోదైనట్లు ఆమె వెల్లడించారు. తాజా ఆదాయపన్ను రిటర్నుల ప్రకారం రబ్రీదేవి వార్షికాదాయం రూ. 17.15లక్షలుగా ఉంది. లాలూ ఆదాయం రూ. 9లక్షలు.