లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ | Lalu Prasad Yadav's absence in Chhath festival saddens Rabri Devi | Sakshi
Sakshi News home page

లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ

Published Tue, Nov 5 2013 7:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ

లాలూ లేకపోవడం చాలా బాధగా ఉంది: రబ్రీ

పవిత్రంగా జరుపుకునే ఛత్ పర్వదినాన లాలూ ప్రసాద్ యాదవ్ తమ మధ్య లేకపోవడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆయన సతీమణి రబ్రీ దేవి అన్నారు. తన నివాసంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఛత్ పండగ రోజున జరిగే కార్యక్రమాలను లాలూ దగ్గరుండి చూసుకునే వారు అని అన్నారు.
 
ఛత్ రోజున కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను, ఇతరుల్లో సంతోషం నింపే వారని గతంలో జరుపుకున్న పండగలను గుర్తు చేసుకున్నారు. ఈ సారి లాలూ లేకపోవడం, మాలో విషాదాన్ని నింపింది అని అన్నారు.
 
ఛత్ పండగ కార్యక్రమాల్లో భాగంగా సూర్య భగవానుడికి కోసం గోధుమలను ఎండపెట్టే కార్యక్రమాన్ని రబ్రీ ప్రారంభించారు. లాలూ జైల్లో ఉన్నప్పటికి.. ఆయన స్పూర్తి తమను నడిపిస్తోంది అని అన్నారు. పశుగ్రాస కుంభకోణంలో ప్రస్తుతం రాంచీ జైల్లో లాలూ ప్రసాద్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement