
పట్నా: బీహార్‌లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.
ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు.
जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE
— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024
ఇది కూడా చదవండి: ‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు