లోక్సభ ఎన్నికల్లో బీహార్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. సరాన్ నియోజకవర్గం నుంచి సొంత అక్కాతమ్ముళ్లే పోటీ పడుతున్నారు.
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో బీహార్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. సరాన్ నియోజకవర్గం నుంచి సొంత అక్కాతమ్ముళ్లే పోటీ పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిపై పోటీ చేయనున్నట్టు ఆమె సోదరుడు మాజీ ఎంపీ సాధు యాదవ్ అలియాస్ అనిరుధ్ ప్రసాద్ యాదవ్ చెప్పారు. సరాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు చెప్పారు.
ఇదిలావుండగా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేశారు. తన బామ్మర్ది సాధు యాదవ్ ప్రభావం ఎన్నికలపై ఉండదని, రబ్రీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా రబ్రీదేవి ఈ విషయంపై స్పందిచేందుకు నిరాకరించారు. మీపై తమ్ముడే పోటీ చేస్తున్నారు కదా అన్న ప్రశ్నకు.. రబ్రీదేవి నుంచి చిరునవ్వే సమాధానమైంది. సరాన్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు.