
భార్యకు గులాబి పువ్విచ్చిన లాలూ
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఏం చేసినా సంచలనమే. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. నాలుగు నెలల పాటు ఢిల్లీలోనే గడిపి, ఇటీవలే పాట్నాకు తిరిగొచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన.. తన ఇంటి దగ్గర సంబరాలు చేసుకున్నారు.
అందులో భాగంగా.. తన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి ఓ గులాబిపువ్వు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని టీవీ కెమెరాలు వెంటనే పట్టేశాయి. ఈరోజుల్లో జనమంతా ఇంగ్లీషు క్యాలెండరే ఫాలో అవుతున్నారని, అలాంటప్పుడు వాళ్ల పద్ధతిలోనే తన భార్యకు అభినందనలు చెప్పాలనుకున్నానని ఆయన అన్నారు.