సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు ఇవాళ సాయంత్రానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఏఐసీసీ ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, మంత్రుల జాబితాపై ఖర్గేతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. అనంతరం డీకేఎస్‌తో పాటు మిగిలిన పరిశీలకులు సీల్డ్ కవర్‌తో మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరనున్నారు.
డీకే శివకుమార్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఎల్లా హోటల్‌కు వెళ్లి వారతో సమావేశమవుతారు. అక్కడ సీల్డ్ కవర్‌లో ఉన్న సీఎం పేరును ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలకు మంత్రులెవరనేది కూడా వెల్లడిస్తారు. మొత్తానికి సీఎం పదవి చేపట్టనుందెవరనేది సాయంత్రానికి తేలిపోయే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడుంటుందనేదానిపై పేరు ప్రకటించిన తర్వాతే క్లారిటీ వచ్చే ఛాన్సుంది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ సాధించిన విషయం తెలిసిందే. లెజిస్లేచర్ పార్టీ లీడర్ (సీఎల్పీ) నేతను ఎన్నుకోవడానికి గెలిచిన ఎమ్మెల్యేలంతా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సోమవారం సమావేశమయ్యారు. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవ్యాఖ్య తీర్మానం చేసి పంపించారు. తర్వాత డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీ వెళ్లారు.
ఇదీచదవండి..గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...
Comments
Please login to add a commentAdd a comment