
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? కొత్త మంత్రులు ఎవరనేదానిపై ఉత్కంఠకు ఇవాళ తెరపడే ఛాన్సుంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశానికి వెళ్తూ ఖర్గే ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది సాయంత్రానికల్లా వెల్లడిస్తామని చెప్పారు.
కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకుగాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో చర్చించడానికి సోమవారమే డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ఆయన ఖర్గేతో సమావేశమై చర్చించిన అనంతరం నిర్ణయం వెలువడే ఛాన్సుంది.
మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్‌లు డీకేఎస్‌తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment