Himachal CM
-
Himachal Pradesh: సీఎం పీఠం మా నేతకే...
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ -
హిమాచల్ సీఎంగా జేపీ నడ్డా ?
సాక్షి,న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో సీఎంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేరును పార్టీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమి పాలవడంతో నడ్డా పేరు తెరపైకి వచ్చింది. సీఎం అభ్యర్థి రేసులో గతంలోనూ ధుమాల్‌తో నడ్డా పోటీ పడినప్పటికీ గతంలో రెండు సార్లు సీఎంగా వ్యవహరించడంతో పాటు వీరభద్రసింగ్‌కు దీటైన పోటీ ఇవ్వగలరనే అంచనాతో ధుమాల్వైపే బీజేపీ మొగ్గుచూపింది. ధుమాల్ ఓటమితో తాజాగా జేపీ నడ్డా అభ్యర్థిత్వం వైపు ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా ఆసక్తి చూపుతున్నారు. అగ్రనేతలతో సాన్నిహిత్యం కూడా జేపీ నడ్డాకు కలిసివస్తుందని భావిస్తున్నారు. 68 స్ధానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 40 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 21 స్ధానాలతో ప్రతిపక్ష స్ధానానికి పరిమితం కానుంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. -
హిమాచల్ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు
* తన కుమార్తె వివాహం కోసం ఆలయానికి వెళ్లిన వీరభద్రసింగ్ * తర్వాత కొద్ది నిమిషాలకే అధికారిక నివాసం సహా 12 చోట్ల తనిఖీలు * ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో కేసు నమోదు సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 చోట్ల అధికారులు దాడులు చేశారు. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రులంతా ఉమ్మడి ప్రకటన జారీ చేసిన మరునాడే... సీఎం వీరభద్రసింగ్‌పై సీబీఐ దాడులు జరగడం గమనార్హం. 2009-11 మధ్యలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్లో కేంద్ర ఉక్కు మంత్రిగా పనిచేసినప్పుడు వీరభద్రసింగ్ ఆదాయానికి మించి రూ. 6.1 కోట్ల ఆస్తులు కూడబెట్టారని... ఈ సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఎల్ఐసీ పాలసీలలో మదుపు చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక నమోదు చేసిన సీబీఐ... కొద్దిరోజుల కిందే దానిని అవినీతి నిరోధక చట్టం కింద కేసుగా మార్చింది. వీరభద్రతోపాటు ఆయన భార్య ప్రతిభ, మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి.. శనివారం దాడులు చేసింది. ఉదయం 7.30 సమయంలో తన రెండో కుమార్తె పెళ్లి నిమిత్తం వీరభద్ర సిమ్లాలోని సంకట్ మోచన్ ఆలయానికి బయలుదేరారు. కొద్దిసేపటికే సీఎం అధికారిక నివాసంపై 18 మంది సీబీఐ అధికారుల బృందం దాడులు చేసింది. దీంతో పాటు మరో రెండు ఇళ్లు, ఢిల్లీలోని అధికారిక నివాసం, ఫామ్‌హౌజ్‌పై, ఆయన స్నేహితులు ఆనంద్ చౌహాన్, చున్నిలాల్‌లకు చెందిన ఐదు నివాసాల్లో తనిఖీలు చేశారు. అయితే వివాహం అనంతరం వీరభద్రసింగ్ కుటుంబం 11గంటలకు నివాసానికి తిరిగి వచ్చింది. కాగా, మోదీ ప్రభుత్వం సీబీఐని ఉపయోగించి విపక్షాలపై కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరభద్రసింగ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
''హిమాచల్ ఘటనపై విచారణకు ఆదేశం''