వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ | EVM And VVPAT Thrown In Water At West Bengal's South 24 Parganas | Sakshi
Sakshi News home page

వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్‌

Published Sat, Jun 1 2024 10:56 AM | Last Updated on Sat, Jun 1 2024 11:16 AM

EVM And VVPAT Thrown In Water At West Bengal's South 24 Parganas

కోల్‌కత్తా: తుది దశలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్‌ పరగణా-24లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం, వీవీప్యాట్‌లను మురికి కాల్వలోకి విసిరేశారు.

కాగా, బెంగాల్‌లో పోలింగ్‌ సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పాయి. సౌత్‌ పరగణా-24లో ఉన్న కుల్టై వద్ద పోలింగ్‌ బూత్‌ 40, 41లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం బూత్‌లో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్‌లను మురికి కాల్వలోకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

ఇక, ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించారు. ఈ సందర్భంగా..‘ఈరోజు ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్‌పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ఈవీఎంలు, పేపర్లను కాల్వలోకి విసిరేశారు. ఈ క్రమంలో సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ పోలింగ్‌ కొనసాగుతోంది’ అంటూ ట్విటర్‌ వేదికగా తెలిపింది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement