voting counting centers
-
వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
కోల్కత్తా: తుది దశలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్ పరగణా-24లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు.కాగా, బెంగాల్లో పోలింగ్ సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పాయి. సౌత్ పరగణా-24లో ఉన్న కుల్టై వద్ద పోలింగ్ బూత్ 40, 41లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం బూత్‌లో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024ఇక, ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించారు. ఈ సందర్భంగా..‘ఈరోజు ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ఈవీఎంలు, పేపర్లను కాల్వలోకి విసిరేశారు. ఈ క్రమంలో సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కొనసాగుతోంది’ అంటూ ట్విటర్ వేదికగా తెలిపింది. (1/2)Today morning at 6.40 am Reserve EVMs & papers of Sector Officer near Benimadhavpur FP school, at 129-Kultali AC of 19-Jaynagar (SC) PC has been looted by local mob and 1 CU, 1 BU , 2VVPAT machines have been thrown inside a pond.— CEO West Bengal (@CEOWestBengal) June 1, 2024 -
పోలింగ్ వీక్షణం కేంద్రాల గుర్తింపునకు జియోట్యాగింగ్..
కరీంనగర్: వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి ఓటరు జాబితా రూపొందిస్తుండగా పోలింగ్ స్టేషన్ల జియోట్యాగింగ్‌కు చర్యలు చేపట్టింది. 2018 శాసనసభ ఎన్నికల్లోనే సదరు ప్రక్రియ చేపట్టగా మళ్లీ పరిశీలన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ఘటనలకు తావులేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్(ఏరోనెట్) విధానంలో బోగస్ ఓట్లను ఏరివేయగా నివాస ప్రాతిపదికన ఓటు హక్కు కల్పిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో.. జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలుండగా వీటి పరిధిలో 20మండలాలున్నాయి. జిల్లాలో 1,338 పోలింగ్ కేంద్రాలుండగా పోలింగ్ జియోట్యాగింగ్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేంద్రాల మార్పు, పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్ నియోజకవర్గంలో 11 కేంద్రాలను మార్పు చేయగా, 19 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేశారు. చొప్పదండి 25 పోలింగ్ కేంద్రాల మార్పు, 18 పేర్లు మార్పుచేశారు. మానకొండూర్ 6 కేంద్రాల మార్పు, ఒకటి పేరు మార్పు, హుజూరాబాద్‌లో ఒకకేంద్రాన్ని మార్పు చేయగా 6 పేర్లు మార్చారు. ఆధునిక సాంకేతికతను వాడి టీఎస్ సీవోపీ ప్రత్యేక యాప్ ద్వారా గుగూల్ మ్యాపును అనుసరించి పోలింగ్ కేంద్రం చిత్రాలు సహా ఇతర విషయాల్ని పొందుపరుస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిల.. నియోజకవర్గాల వారీగా కేంద్రాలు జియోట్యాగ్‌తో ప్రయోజనం.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు నేరుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా ఆయా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. ఆయా కేంద్రాలకు మధ్య ఉన్న దూరం తదితర విషయాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. జిల్లాకేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంగా ఇవి ఉండటంతో పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. ఏవైనా గొడవలు జరిగినా వెనువెంటనే అక్కడికి చేరుకునేందుకు సులువవనుంది. ఏరోనెట్‌తో బోగస్‌కు చెక్.. కుటుంబం మొత్తానికి ఒకేచోట ఓటుహక్కు కల్పించేందుకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్ (ఎరోనెట్) విధానాన్ని అనుసరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటుహక్కు ఉందో తేలనుంది. సదరు వివరాలు ఆధారంగా అధికారులు విచారణ చేసి ఎక్కడ నివాసం ఉంటారో అక్కడనే ఓటుహక్కు కల్పిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్‌లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పులులేని ఓటరు జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. -
ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్
అప్డేట్స్: 10: 05 AM ► స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. నల్లగొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్-1లో భాను ప్రసాద్, కరీంనగర్-2లో ఎల్. రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్, మెదక్‌లో యాదవరెడ్డి విజయం సాధించారు. ► మెదక్‌లో జగ్గారెడ్డి సతీమణి నిర్మల ఓటమి పాలయ్యారు. 09: 30 AM ► ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. 09: 25 AM ► మెదక్‌లోను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ► ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 09: 10 AM ► వీరి గెలుపును మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ► నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. ఆయనకు అధిక ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డికి 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ► ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 738 ఓట్లు పోలయ్యాయి. దీనిలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లను సాధించారు. 08: 10 AM ► నల్లగొండ జిల్లాలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్లను సిబ్బంది బండిల్స్ కడుతున్నారు. ► ఆదిలాబాద్ జిల్లాలో టీడీసీ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ► కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ ప్రకటించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్ననికల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ కోసం ఆదిలాబాద్‌లో 6, నల్లగొండలో 5, మెదక్‌లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కించనున్నారు. ముందు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. నల్లగొండ, మెదక్‌లో రౌండ్లు ఎక్కువ ఉంటాయని సీఈఓ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతించనున్నారు. టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ చొప్పున నియమించుకోవచ్చునని గోయల్ వివరించారు. లెక్కింపు అనంతరం ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3 ప్రయారిటీ ఓట్లు వేసినా, అక్షరాలలో రాసినా లేదా క్రాస్ మార్కు, రైట్ టిక్కు మార్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు. మూడు చోట్ల ఫలితాలపై ఆసక్తి మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరింటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్ నిర్వహించారు. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు బరిలో నిలిచారు. కాగా మూడు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ VS జరిగినట్టు చర్చ జరుగుతోంది. -
భవితవ్యం తేలేది ఇక్కడే
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రత నుంచి ఎన్నికల నోడల్ అధికారుల నియామకం, ఆపై ఎన్నికల సిబ్బంది నియామకం వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత పనులు మరింత వేగంగా జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కామారెడ్డి పట్టణ శివార్లలో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీపంలో ఉన్న మార్కెటింగ్ శాఖ గోదాంలో భద్రపరిచారు. అక్కడ పటిష్టమైన పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికలు నిజామాబాద్ జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల ఎన్నికలు కామారెడ్డి ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఎన్నికల అధికారిగా స్థానిక ఆర్డీవో రాజేంద్రకుమార్ వ్యవహరిస్తున్నారు. నియోజక వర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌గా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేశారు. ఎన్నికలకు వెళ్లే సిబ్బందికి సామాగ్రినంతా ఇక్కడి నుంచే అందజేస్తారు. తరువాత రిసీవింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎల్లారెడ్డి నియోజక వర్గానకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా అక్కడి జీవదాన్ హైస్కూల్‌ను ఎంపిక చేశారు. అక్కడి నుంచే సిబ్బందికి సామాగ్రిని అందజేస్తారు. అలాగే తిరిగి అక్కడే రిసీవ్ చేసుకుంటారు. స్థానిక ఆర్డీవో దేవేందర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. జుక్కల్ నియోజక వర్గానికి సంబంధించి మద్నూర్లోని బాలుర ఉన్న పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. కామారెడ్డిలో మూడుస్థానాల కౌంటింగ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల ఎన్నికల కౌంటింగ్ కామారెడ్డి పట్టణంలోని మార్కెటింగ్ శాఖ గోదాంలో నిర్వహించనున్నారు. కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మిస్తున్న చోట ఉన్న ఈ గోదాంను ప్రస్తుతం వీవీప్యాట్లు, ఈవీఎంలను భద్రపరచడానికి వాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఈవీఎంలు, వీవీప్యాట్లను కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. డిసెంబర్ 7న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షలలో స్ట్రాంగ్‌రూంను తెరిచి కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెడతారు. ఒక్క బాన్సువాడ నియోజక వర్గానికి సంబంధించి కౌంటింగ్ మాత్రం నిజామాబాద్‌లో జరుగనుంది. ఇందూరులో నాలుగు స్థానాలకు.. సాక్షి,నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. జిల్లాలో జరిగిన సాధారణ ఉప ఎన్నికలకు సంబంధించి రెండు సార్లు మినహా మిగతా అన్ని సంవత్సరాల సాధారణ, ఉప ఎన్నికల ఫలితాలకు కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలనే కేంద్ర బిందువు. సాధారణ ఎన్నికలు వచ్చాయంటే పాలిటెక్నిక్ కళాశాల భద్రత వలయంలోకి వెళుతుంది. గతంలో పాలిటెక్నిక్ కళాశాలలో పాత జిల్లాలోని 9 నియోజక వర్గాల ఫలితాలను వెలువరించేవారు. ఎన్నికల నిర్వహణ ముగియగానే బ్యాలెట్బాక్సులు, ఈవీఎంలను పాలిటెక్నిక్ కళాశాలలో భద్రతపరుస్తారు. గతంలో ఫలితాలు వెల్లడిం చేందుకు దాదాపు నెలరోజుల సమయం పట్టేది. అంత వరకు పాలిటెక్నిక్ కళాశాలలోని గోదాముల్లో వీటిని భద్రపరిచేవారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఏర్పాటు కావడంతో నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాలు, బాన్సువాడ నియోజకవర్గ ఫలితాలు సైతం ఇక్కడే వెలువరించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు నిజామాబాద్‌లో, మరికొన్ని కామారెడ్డిలో ఉండగా ఎన్నికల బాధ్యతను నిజామాబాద్ కలెక్టర్‌కే అప్పగించారు. దీంతో ఆ నియోజకవర్గ ఫలితాలు కూడా ఇక్కడే వెలువడనున్నాయి. ఫలితాల విడుదల చేసే రోజు కళాశాల ఉన్న కంఠేశ్వర్ ప్రాంతం సందడిగా మారుతుంది. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా బిజీబిజీగా ఉంటుంది. రెండుసార్లు మినహా.. 2014 సాధారణ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ డిచ్పల్లిలోని మెడికల్ కళాశాలలో నిర్వహించారు. అలాగే, 1999 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలు బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాన్ని సుభాష్‌నగర్‌లోని నిర్మల హృదయపాఠశాలలో ఏర్పాటుచేశారు. మిగతా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగింది. -
న్యూఢిల్లీలో 14 కేంద్రాలలో ఓటింగ్ లెక్కింపు
న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభకు పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంమైంది. న్యూడిల్లీలో14, రాజస్థాన్‌లో 37, ఛత్తీస్‌గఢ్‌లో 27, మధ్యప్రదేశ్‌లో 51 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. పోలింగ్ లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే గుజరాత్‌లోని సూరత్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గానికి,తమిళనాడులోని ఏర్కాడ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోలైన ఓట్ల లెక్కింపు కూడా ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ వంకవల్ మరణంతో సురత్ పశ్చిమ నియోజవర్గానికి ఖాళీ ఏర్పడింది.