కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 24 దక్షిణ పరగణా జిల్లాల్లో వర్షం పడుతున్నా జనం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. గొడుగుల సహాయంతో క్యూ లైన్లలో నిలబడ్డారు. అటు.. గవర్నర్ సీవీ ఆనంద్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు బసుదేబ్‌పూర్ బూత్‌కు వెళుతున్న క్రమంలో సీపీఐఎమ్ అభ్యర్థులు ఆయన్ను అడ్డగించారు.
#WATCH | West Bengal #PanchayatElection23 | Voters queue up at a polling station in Basanti of South 24 Parganas district amid rainfall as they await their turn to cast a vote. pic.twitter.com/Iq7xBpbpft
— ANI (@ANI) July 8, 2023
బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించి..
కాగా.. పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బిహార్ జిల్లాలోని సిటాయ్ ప్రాతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌కు ఏర్పాట‍్లు చేయగా.. దుండగులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించారు.
#WATCH | Polling booth at Baravita Primary School in Sitai, Coochbehar vandalised and ballot papers set on fire. Details awaited.
— ANI (@ANI) July 8, 2023
Voting for Panchayat elections in West Bengal began at 7 am today. pic.twitter.com/m8ws7rX5uG
63,229 సీట్లకు పోలింగ్..
పశ్చిమ బెంగాల్‌లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల‍్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.
ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి
Comments
Please login to add a commentAdd a comment