queue
-
రేషన్ కోసం పడిగాపులు
ధర్మవరం: రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలో నుంచోలేక నానా అవస్థలు పడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవ రం పట్టణం కేతిరెడ్డి కాలనీలోని కార్డుదారులు శనివారం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌక డిపో వద్దకు వచ్చారు. ఎండలో గంటల తరబడి క్యూలో నుంచో లేక సంచులు పెట్టి తమవంతు కోసం ఎదు రు చూస్తున్నారు. కూలి పనులు చేసుకునే పేదలు ఇలా రోజంతా రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటలకే ఇలా సంచులను క్యూలో పెట్టి.. ఆ పక్కనే తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమవంతు రాకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తున్నారని, ఆ తర్వాత వెళితే.. సరుకులు అయిపోయాయంటూ డీలర్ తమను వెనక్కి పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎస్‌డీటీ లక్ష్మీదేవి అక్కడికి చేరుకుని డీలర్‌తో మాట్లాడి త్వరితగతిన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.కూటమి ప్రభుత్వం వచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విని యోగదారుల ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో రేషన్ వాహనాలు రాకపోవడంతో ప్రజలు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఇలా అవస్థలు పడుతున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేస్తున్న ప్రకటనలతో రేషన్ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని భయపడిపోతున్నారు. -
డోమ్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ..
న్యూఢిల్లీ: పెన్సిళ్ల తయారీ దిగ్గజం డోమ్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి తొలి రోజే(బుధవారం) ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కంపెనీ 88 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 5 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 5.7 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఈ బాటలో సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 8 రెట్లు బిడ్ చేయగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి కేవలం 6% మాత్రమే స్పందన నమోదైంది. ఇష్యూ లో భాగంగా కంపెనీ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 850 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకి రూ. 750–790 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించిన కంపెనీ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 538 కోట్లు సమకూర్చుకుంది. -
Viral video: ఖరీదైన అపార్ట్మెంట్ల కోసం ఎగబడిన కస్టమర్లు.. 8 గంటలు క్యూలో నిలబడి మరీ!
పైన ఫొటోలో మీరు చూస్తున్న జనం ఏవో ఉచిత పథకాల వచ్చినవారు కాదు. సుమారు రూ.2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనేందుకు వచ్చారు. నమ్మలేకపోతున్నారా? ఖరీదైన అపార్ట్మెంట్లను లోపలికి వెళ్లి చూసేందుకు ఇలా ఎనిమిది గంటలపాటు క్యూలో నిలబడి మరీ నిరీక్షించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దేశంలోని కొన్ని ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఖరీదైన ఇళ్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అధిక నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే చాలా మంది ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల పుణేలో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలి వెళ్లి అపార్ట్మెంట్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది గంటల పాటు క్యూలో నిల్చున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో పొడవైన లైన్లు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇది నమ్మశక్యంగా లేదన్నారు. అంత ఖరీదైన అపార్ట్మెంట్లను కొనేవారు అలా క్యూలో నిలబడరని ఓ యూజర్ కామెంట్ చేశారు. కొంతమంది కిరాయి వ్యక్తులతో బిల్డర్ చేసిన మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. Guys, will you stand in a queue for 8 hours if you are spending 1.5cr-2cr to buy an apartment???? pic.twitter.com/4OtNw9DtmE — Ekant | ek 🐜 (@Ayeits_Ekant) October 23, 2023 -
ఆర్బీఐ కార్యాలయాల ముందు క్యూ
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్పిడి, డిపాజిట్‌కు సెపె్టంబర్ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
కొండంత భక్తి!
తిరుమల: తమిళనాడు వాసులకు పవిత్రమైన పెరటాసి మాసం ఓ వైపు, మరోవైపు అక్టోబర్ 2 వరకు వరుస సెలవులు రావడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద వర్సిటీ వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రోడ్డుకిరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తోన్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. క్యూల్లో ఉన్నవారికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 2,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందిస్తున్నారు. సెపె్టంబర్ 30 నాటికి శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఈ విషయమై పలు భాషల్లో ప్రకటనలు చేస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని టీటీడీ తెలిపింది. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. మరోవైపు ఓటింగ్ సామాగ్రి ధ్వంసం..
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 24 దక్షిణ పరగణా జిల్లాల్లో వర్షం పడుతున్నా జనం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. గొడుగుల సహాయంతో క్యూ లైన్లలో నిలబడ్డారు. అటు.. గవర్నర్ సీవీ ఆనంద్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు బసుదేబ్‌పూర్ బూత్‌కు వెళుతున్న క్రమంలో సీపీఐఎమ్ అభ్యర్థులు ఆయన్ను అడ్డగించారు. #WATCH | West Bengal #PanchayatElection23 | Voters queue up at a polling station in Basanti of South 24 Parganas district amid rainfall as they await their turn to cast a vote. pic.twitter.com/Iq7xBpbpft — ANI (@ANI) July 8, 2023 బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించి.. కాగా.. పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బిహార్ జిల్లాలోని సిటాయ్ ప్రాతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేయగా.. దుండగులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించారు. #WATCH | Polling booth at Baravita Primary School in Sitai, Coochbehar vandalised and ballot papers set on fire. Details awaited. Voting for Panchayat elections in West Bengal began at 7 am today. pic.twitter.com/m8ws7rX5uG — ANI (@ANI) July 8, 2023 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే...
ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం వంటివి సర్వ సాధారణం. ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం జౌనా! పాపం అలానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని ఆగుతారు. గంటలు గంటలు గడిచిపోతాయే కానీ ఎంతసేపటికి కదలడు. ఇక విసిగిపోయి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తట్టగా ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలంతా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందంటే...యూకేలోని టెస్కో క్యాష్ పాయింట్ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. ఎంతకీ ఒక పట్టాన కదలడు. ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు. అయినా కదలడు. దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది బొమ్మ. దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. అబ్బా టైం వేస్ట్ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK — UB1UB2 Southall (@UB1UB2) September 30, 2022 (చదవండి: Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్) -
కరోనా టెస్టుల కోసం ప్రజలు క్యూ
-
‘ప్లీజ్ సీఎంగారు.. మా సినిమా చూడండి’
బెంగళూరు: సాధారణంగా సమస్యలు ఉన్నవాళ్లే ముఖ్యమంత్రి నివాసం ముందు భారీ క్యూలు కడుతుంటారు. ఎంతకష్టమైనా వాటిని పరిష్కరిస్తామని హామీ వచ్చే వరకు అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి కూడా వారి సమస్యలు సావధానంగా వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం వారికి ముఖం కూడా చూపించడం లేదు. ఎందుకంటే వచ్చినవాళ్లంతా సమస్యలు ఉన్నవాళ్లు కాదు.. సినిమా నిర్మాతలు. అవును ఇప్పుడు పొద్దున లేస్తే సీఎం సిద్ద రామయ్య ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో సినీ నిర్మాతలే క్యూ కడుతున్నారు. అందుకు కారణం ఆయన కార్యాలయ సిబ్బంది చేసిన పనే. ఇంతకీ వాళ్లేం చేశారంటే.. ఇటీవల సీఎం సిద్దు రాజ్‌కుమార్ నటించిన రాజకుమార వీక్షించారు. ఈ ఫొటోను ఆయన కార్యాలయ సిబ్బంది అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టింది. అనంతరం రాజ్‌కుమార్ సీఎం సిద్దరామయ్యను ప్రత్యేకంగా కలిసి ఇందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, ఇటీవలె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రభుత్వం తరుపున పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరొగొచ్చే సమయంలో విశ్రాంతి కోసం ఒకే రోజు బాహుబలి-2, నిరుత్తర అనే చిత్రాన్ని చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన కార్యాలయ సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు నిర్మాతలంటూ ఆయన కోసం క్యూ కట్టారు. సాధారణంగా సీఎం సినిమా చూశారంటే ఆ సినిమాకి మంచి ప్రచారం కావున సీఎం తమ సినిమా అంటే తమ సినిమా చూడాలంటూ నిర్మాతలు తెగ ఎగబడుతున్నారు. అయితే, కాలేజీ రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసే తాను రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పటికో చూసేందుకుగానీ వీలు కావడం లేదని, ప్రస్తుతం బిజీ పనుల కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు చూడటం కుదరదని అన్నారు. నిర్మాతలకు తనపై ఉన్న ప్రేమకు ధన్యవాదాలని చెప్పారు. -
క్యూలైన్లో వృద్ధురాలి చేయి విరిగింది..
మెదక్: నగదు కోసం రోజులు తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సిరావడంతో ఖాతాదారుల్లో ఓపిక నశిస్తోంది. క్యూలో తోపులాటలు జరుగుతున్నాయి. స్థానిక ఎస్బీహెచ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం తోపులాట చోటుచేసుకుంది. మండలంలోని బడంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్ అహ్మద్బి పింఛను డబ్బుల కోసం తన కోడలితో కలిసి బ్యాంకు వద్దకు వచ్చింది. ఉదయానికే భారీ లైను ఉండడంతో ఆమె కూడా లైన్లో నిలబడింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా జనం తోసుకోవడంతో అహ్మద్బి కింద పడిపోయింది. క్యూలో నిలుచుకున్న మరికొందరు ఆమెపై పడిపోవడంతో బ్యాంకు తలుపు అద్దాలు తగిలి ఒత్తిడికి చేయి విరిగిపోయింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఆ వృద్ధురాలిని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించి సంగారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. -
పింఛన్ కోసం క్యూలో నిలబడ్డ వృద్ధురాలు మృతి
-
మొదటి ఆదివారం అదే పరిస్థితి
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. జీతం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. వాటిని తీసుకోలేని పరిస్థితి ఉద్యోగులది. దీంతో డిసెంబర్ నెల మొదటి ఆదివారం కూడా సామాన్య ప్రజలు ఎలాంటి ఖర్చులకు వెళ్లకుండా ఉండటం కనిపిస్తోంది. మార్కెట్లో చికెన్, మటన్ షాపులు వెలవెలబోతున్నాయి. మరోవైపు డబ్బుకోసం ఏటీఎంలకు వెళ్తున్న ప్రజలను అక్కడి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే డబ్బులున్న ఏటీఎంలు కనిపిస్తున్నా.. అక్కడ భారీ క్యూ లైన్లలోనే సెలవుదిన సమయం గడిచిపోతుంది. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 80 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. -
'లక్ష్మి' కోసం వెళ్తే మరో లక్ష్మి వచ్చి పలకరించింది
-
నగదుకోసం క్యూలో ఉంటే...
కాన్పూర్: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు విత్ డ్రా కోసం ఏర్పడుతున్న క్యూ లైన్లలో మరో ఆసక్తికర సంఘటన నమోదైంది. డబ్బుల కోసం క్యూలో నిలుచుంటే.. అనూహ్యంగా శుక్రవారం పూట లక్ష్మి వచ్చి పలకరించింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లాలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...దేహత్ జిల్లాకు చెందిన సర్వేష (30) అత్తగారితో కలిసి నగదు విత్ డ్రా కోసం బ్యాంకు కు వెళ్లింది. గురువారం క్యూ లో నిలుచున్నా ఫలితం దక్కకపోవడంతో మళ్లీ శుక్రవారం ఉదయం నుంచి క్యూలో వెయిట్ చేస్తోంది. ఇంతలో సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో అక్కడున్న మహిళలు ఆమెకు అండగా నిలిచారు. వారి సహాయంతో సర్వేష బ్యాంకులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పోలీసులు తల్లీబిడ్డలను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అయితే తనకోడలు చాలా బలహీనంగా ఉండడటంతో తనకు భయమేసిందని సర్వేష అత్తగారు తెలిపింది. కానీ అందమైన పుట్టడం సంతోషంగా ఉందనీ, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో సర్వేష భర్త అశ్వేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో యూపీ ప్రభుత్వం సుమారు రూ.2.75 లక్షలు, ఇల్లు పరిహారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవడకోసం అత్తతో కలిసి బ్యాంకుకు వెళ్లింది. -
బ్యాంకులకు వరుస సెలవులు.. నోట్ల ఇక్కట్లు
అమరావతి: వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగోవ శనివారం, ఆదివారం సెలవులకు తోడు సోమవారం ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నగదు తీసుకోవడానికి ఏటీఎంలు తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఉన్న ఏటీఎంలలో మూడోవంతు పనిచేయడం లేదు. దీంతో గత రెండు రోజులతో పోలిస్తే ఉన్న ఏటీఎంల వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2,500 నగదు తీసుకోవడానికి అవకాశం ఉన్నా రెండువేల నోట్లు మాత్రమే ఉంటుండటంతో అంతకుమించి తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. రెండు రోజుల సెలవులను దృష్టిలో పెట్టుకొని ఏటీఎంలలో అధిక నగదును నింపామని, ఒకవేళ అవి అయిపోతే సోమవారం వరకు ఆగాల్సిందేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం బంద్ అయినా అన్ని బ్యాంకులు పనిచేస్తాయని, ఒకవేళ ఎవరైనా వచ్చి బలవంతంగా మూసివేయిస్తే మాత్రం ఏమీ చేయలేమంటున్నారు. సోమవారం బ్యాంకులను తప్పకుండా తెరవాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు. -
ఏటీఎం వద్ద నిల్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: ఏటీఎం వద్ద అర్ధరాత్రి క్యూలో నిల్చున్న వారిపైకి కారు వేగంగా దూసుకు రావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యారుు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు సొహైల్ (19), రిజ్వాన్ (19), నవీన్ (19) డబ్బుల కోసం గురువారం అర్ధరాత్రి నానల్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లారు. అక్కడ జనాలు బారులు తీరి ఉన్నారు. దీంతో వారి వెనుక వరుసలో ముగ్గురు స్నేహితులు నిలబడ్డారు. 2.30 ప్రాంతంలో లంగర్‌హౌస్ నుంచి వచ్చిన తెలుపురంగు స్విఫ్ట్ కారు ఏటీఎం వద్ద నిలబ డిన వారిపైకి దూసుకెళ్లింది. దీంతో రిజ్వాన్, నవీన్‌లకు తీవ్రగాయాలయ్యాయిు. సొహైల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు ఆపకుండా దూసుకుపోరుుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధా రంగా కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
మహిళను బలిగొన్న క్యూలైన్
డబ్బుల కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ మహిళ.. అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లికి చెందిన మహమూదా బేగం (40) గురువారం ఉదయం డబ్బు కోసం పెబ్బేరులోని ఎస్బీఐ బ్రాంచీకి వెళ్లింది. సాయంత్రం 4 గంటల దాకా క్యూలో నిలబడి డబ్బు తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ రాత్రి మహమూదా గుండెపోటు, వాంతులతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. -
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ
-
ఏటీఎం వద్ద క్యూలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం కొత్త నోట్లను విత్ డ్రా చేసుకోవడానికి పార్లమెంటు వీధిలోని ఎస్ బీఐ ఏటీఎం వద్దకు వచ్చారు. సాధారణ ప్రజలతో పాటే క్యూ లో వేచి చూశారు. గంటల తరబడి క్యూలో వేచి వున్న చిల్లర బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన నాలుగు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు తాను ఏటీఎం వద్దకు వచ్చినట్లు చెప్పారు. నల్లధనం పేరుతో ప్రజలకు మోదీ ప్రభుత్వం నరకం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నేటి నుంచి ఏటీఎంలలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రజలు బారులుతీరారు. ఏటీఎంల వద్ద రద్దీ విపరీతంగా ఉండటంతో భద్రతను పెంచాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశాలు జారీ చేసింది. -
పాలీ హౌస్‌ల కోసం క్యూలో మంత్రి కుమారుడు !
కోలారు : ఓ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కుమారుడు సాధారణ వ్యక్తి తరహాలో దరఖాస్తుల కోసం క్యూలో నిలబడి అందరికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రమేష్ కుమార్ కుమారుడు హర్ష పాలీ హౌస్‌ల కోసం శుక్రవారం అందరితో పాటు క్యూలో నిలబడి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పాలీ హౌస్‌ల కోసం మొదట వచ్చిన 200 దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా అధికారులు ప్రకటించడంతో రైతులు దరఖాస్తుల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో హర్ష సైతం ఉదయమే డీపీఓ కార్యాలయానికి చేరుకుని వరుసులో నిలుచున్నారు. పాలీ హౌస్‌లకు సంబంధించి ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు రాకూడదని మంత్రి రమేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు సైతం బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు హర్షం సైతం సామాన్య రైతు మాదిరిగా వరుసలో నిలబడి దరఖాస్తు కోసం వేచి ఉండటం అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో పలువురు హర్ష నిరాడంబరతను అభినందించారు. -
వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ
బంజారాహిల్స్ (హైదరాబాద్): వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు జంతు ప్రేమికులు క్యూ కట్టారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులోని లేక్‌వ్యూ పార్క్‌లో హైదరాబాద్ పెట్ అడాప్షన్ అనే స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నగరంలో తొమ్మిదో విడత నిర్వహించిన ఈ దత్తత కార్యక్రమంలో 15 కుక్క పిల్లలను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వారికి అందజేసినట్లు సంస్థ సభ్యులు చిత్ర, శ్రావణి, ఆనంత్రాబర్ట్లు తెలిపారు. అయితే, దత్తత ఇచ్చిన తర్వాత తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోబోమని... నెలకోసారైనా వాటి సంరక్షణ ఎలా ఉందో తెలుసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకూ వేయి కుక్కలను చేరదీసి దత్తత ఇచ్చినట్లు తెలిపారు. -
క్యూలోనే ప్రాణాలు విడిచిన వృద్ధుడు
హైదరాబాద్ : ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సాయం కోసం వృద్ధాప్యంలో నానా కష్టాలు పడాల్సిన దుస్థితి దాపురించింది చాలామంది వృద్ధులకు. రేషన్ కార్డున్నప్పటికీ రేషన్ రాకపోయేసరికి ఉప్పల్ పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... సత్యన్నారాయణ (67), ఆయన భార్య సీతాదేవి 30 ఏళ్ల క్రితమే భీమవరం నుంచి వచ్చి అల్వాల్‌లో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ నెల రేషన్ తీసుకుందామని డీలర్ దగ్గరకు వెళితే... రేషన్ రాలేదని, జాబితాలో మీ పేరు లేదని చెప్పిన డీలర్..సత్యన్నారాయణను ఉప్పల్ పౌరసరఫరాల కార్యాలయానికి వెళ్లాలని సూచించాడు. దీంతో సత్యన్నారాయణ మంగళవారం ఉదయం ఉప్పల్‌కు వచ్చి కార్యాలయం వద్ద క్యూలో నిలుచున్నాడు. ఎండ తీవ్రత వల్లో, మరే కారణమో గానీ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచాడు సత్యన్నారాయణ. ఇది చూసి అక్కడున్న వారు చలించిపోయారు. -
జల గ్రహణం
శివారుల్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు {పైవేటు ట్యాంకర్లే గతి అపార్ట్మెంట్లలో పెరుగుతున్న నిర్వహణ వ్యయం నల్లాల వద్ద భారీ క్యూలు. బోర్ల వద్ద జన సమూహాలు. ట్యాంకర్ల చెంత బిందెలతో యుద్ధాలు. గంటల తరబడి ఎదురు చూపులు... ఎక్కడికక్కడ వెక్కిరిస్తున్న బావులు...అడుగంటిన భూగర్భ జలాలు... ఇవీ నగర శివారుల్లో నీటి కష్టాలకు నిదర్శనాలు. వేసవి ఛాయలు పూర్తిగా కనిపించకముందే నగరంలో ప్ర‘జల’ఘోష మొదలైంది. భవిష్యత్తుపై బెంగను పెంచుతోంది. సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో వేసవికి ముందే బోరు బావులు బావురుమంటున్నాయి. మహా నగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 800కు పైగా కాలనీలు, బస్తీల్లో ఫిబ్రవరి మొదటిలోనేప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుమారు 30 లక్షల మందికి నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. వేలాది నివాసాలు, అపార్ట్మెంట్ల వాసులు నీటి ముప్పును తలచుకొని తల్లడిల్లుతున్నారు. జలమండలికి మంచినీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం, ఇంకుడు గుంతలు లేక బోరుబావులు వట్టిపోవడంతో నిత్యం ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడక తప్పని దుస్థితి నెలకొంది. అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు ఒక్కొక్కరు రోజు వారీ వినియోగం, ప్రాంతాన్ని బట్టి నీటి కోసం నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా ఖర్చు చేయక తప్పని దుస్థితి నెలకొంది. ప్రగతి నగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్, యాప్రాల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, ఎల్బీనగర్, బండ్లగూడ, గాజులరామారం..అన్నిచోట్లా ఇదే దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుండడం గమనార్హం. మరోవైపు బస్తీల్లో ట్యాంకర్ల వద్ద అప్పుడే మహిళల ‘పానీ పట్టు’ యుద్ధాలు మొదలయ్యాయి. జనం అవస్థలకు నిదర్శనాలివీ ఉప్పల్‌లో: సర్కిల్లోని మూడు డివిజన్లలో 2014 జనవరిలో సగటున 8.20 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యం కాగా... 2015 జనవరి లో 12.45 లోతుకు నీటి మట్టాలు పడిపోయాయి. రామంతాపూర్‌లోని వెంకట్‌రెడ్డి నగర్, రాంరెడ్డి నగర్, వివేక్‌నగర్, శ్రీనివాసపురం, గోఖలే నగర్, నెహ్రూ నగర్, ఇందిరానగర్, ప్రగతి నగర్, సాయిచిత్రా నగర్ తదితర బస్తీలు... కాలనీల్లో 1500-2000 అడుగుల వరకు బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. ఇటీవల నెహ్రూ నగర్లో జీహెచ్ఎంసీ అధికారులు 1500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించకపోవడం గమనార్హం. స్థానిక అపార్ట్మెంట్లలో ఉంటున్న ప్రతి కుటుంబం నెలకు నీటి కోసం రూ.2000-రూ.3000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. హైటెక్ నగరిలో: మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటాయి. ఈ ప్రాంతాల్లో 1500 అడుగుల లోతుకు బోరు వేసినానీరు రావడం లేదు. కొండాపూర్, శ్రీరాంనగర్ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాలలోని అపార్ట్మెంట్లలో ఒక్కో ఫ్లాట్ యజమాని నెలకు రూ.2500 చొప్పున నీటి కోసం వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ నిత్యం 35 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ (5000 లీటర్లు)కు రూ.650 వంతున చెల్లిస్తున్నారు. వేసవి కాలం వస్తే ట్యాంకర్‌కు రూ.వెయ్యికిపైగా చెల్లించాల్సి వస్తుంది. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు అద్దె రూ.9,000 కాగా నిర్వహణ ఖర్చు అందులో 25 శాతం కావడం గమనార్హం. నిజాంపేట్‌లో: బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నిజాంపేట్‌లో ఎక్కడ చూసినా దాహార్తితో జనం అల్లాడుతున్నారు. ఫ్లాట్లలో నివసిస్తున్నవారు ఇంటి అద్దె రూ.6 వేలు, నీటి కోసం మరో రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరనీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి స్థానిక హైస్కూల్ పక్కనే వాటర్ ట్యాంక్ నిర్మించారు. నీరు మాత్రం స్థానికుల అవసరాలకు సరిపడే స్థాయిలో అందడం లేదు. దీంతో చాలా భవన సముదాయాలు బోర్లపై ఆధార పడుతున్నాయి. ప్రస్తుతం ఆ బోర్లు కూడా నీరిచ్చే స్థితిలో లేవు. దాదాపు రెండు వేల అడుగుల లోతుకు వెళ్లినానీటి జాడ దొరకడం లేదు. పంచాయతీ పరిధిలో దాదాపు 50వేల మంది కష్టాలు పడుతున్నారు. దీంతో భవన యజమానులు, అపార్టుమెంట్ అసోసియేషన్లు, ప్లాట్ల యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1400కు కొనుగోలు చేస్తున్నారు. ప్రగతినగర్ పంచాయతీలోనూ ఇదే దుస్థితి. 15 ఫ్లాట్లు ఉండేఅపార్ట్మెంట్కు నిత్యం ఐదు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. -
కొండ క్యూలో చీకట్లు
నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులకు కష్టాలు పర్యవేక్షించని అధికారులు ఈవో చొరవ చూపాలని భక్తుల విజ్ఞప్తి తిరుమలలోని నారాయణగిరి క్యూలలో శనివారం రాత్రి అంధకారం నిండిపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన సామాన్య భక్తులు అవస్థలు పడ్డారు. 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారుల బృందం కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లపై మాత్రమే దృష్టి సారించింది. అన్ని విభాగాల అధికారులు కేవలం వీఐపీలకు దర్శన పాసులు, గదుల కేటాయింపు కోసమే అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. తిరుమల: భక్తుల రద్దీ ఏర్పాట్ల ను కొందరు అధికారులు తప్ప అధిక సంఖ్యలోని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి కాలిబాట భక్తుల క్యూలలో వెలగని విద్యుత్‌ద్దీపాలే ఇందుకు నిదర్శనం. మధ్యలో పెద్ద ఫ్లడ్‌లైటు మాత్రమే వెలిగించా రు. క్యూల పక్కనే ఏర్పాటు చేసిన మిగిలిన లైట్లను వెలిగించడం మరిచారు. భక్తులకు రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు, ఇంజినీర్లు ముఖం చాటేయడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఫలి తంగా భక్తులకు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. చీకటిలోనే శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీల బోల్టులు రాసుకుని చాలా మంది భక్తులు ఇబ్బందులు చవి చూశారు. సమస్యపై ఈవో చొరవ చూపాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.