పైన ఫొటోలో మీరు చూస్తున్న జనం ఏవో ఉచిత పథకాల వచ్చినవారు కాదు. సుమారు రూ.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లు కొనేందుకు వచ్చారు. నమ్మలేకపోతున్నారా? ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను లోపలికి వెళ్లి చూసేందుకు ఇలా ఎనిమిది గంటలపాటు క్యూలో నిలబడి మరీ నిరీక్షించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
దేశంలోని కొన్ని ప్రముఖ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఖరీదైన ఇళ్లకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అధిక నాణ్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే చాలా మంది ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల పుణేలో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలి వెళ్లి అపార్ట్‌మెంట్‌లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఎనిమిది గంటల పాటు క్యూలో నిల్చున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ ప్రాంతంలో పొడవైన లైన్లు కనిపించాయి.
దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై యూజర్ల నుంచి మిశ్రమ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇది నమ్మశక్యంగా లేదన్నారు. అంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌లను కొనేవారు అలా క్యూలో నిలబడరని ఓ యూజర్ కామెంట్ చేశారు. కొంతమంది కిరాయి వ్యక్తులతో బిల్డర్ చేసిన మార్కెటింగ్ వ్యూహం కావచ్చని మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు.
Guys, will you stand in a queue for 8 hours if you are spending 1.5cr-2cr to buy an apartment???? pic.twitter.com/4OtNw9DtmE
— Ekant | ek 🐜 (@Ayeits_Ekant) October 23, 2023
Comments
Please login to add a commentAdd a comment