ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే... | Viral Video: Nobody Observed How Still Man In Front Of ATM | Sakshi
Sakshi News home page

Viral Video: ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే...

Published Sat, Oct 1 2022 9:28 PM | Last Updated on Sun, Oct 2 2022 8:08 AM

Viral Video: Nobody Observed How Still Man In Front Of ATM - Sakshi

ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం లేదా డిపాజిట్‌ చేయడం వంటివి సర్వ సాధారణం. ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం జౌనా! పాపం అలానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని ఆగుతారు. గంటలు గంటలు గడిచిపోతాయే కానీ ఎంతసేపటికి కదలడు. ఇక విసిగిపోయి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తట్టగా ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలంతా షాక్‌ అయిపోతారు.

అసలేం జరిగిందంటే...యూకేలోని టెస్కో క్యాష్‌ పాయింట్‌ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. ఎంతకీ ఒక పట్టాన కదలడు. ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు. అయినా కదలడు. దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది బొమ్మ.

దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. అబ్బా టైం వేస్ట్‌ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి.

(చదవండి: Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్‌...పర్యావరణ అధికారులు ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement