మహిళను బలిగొన్న క్యూలైన్
డబ్బుల కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్యాంకు వద్ద క్యూలో నిలబడిన ఓ మహిళ.. అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లికి చెందిన మహమూదా బేగం (40) గురువారం ఉదయం డబ్బు కోసం పెబ్బేరులోని ఎస్‌బీఐ బ్రాంచీకి వెళ్లింది. సాయంత్రం 4 గంటల దాకా క్యూలో నిలబడి డబ్బు తీసుకుని ఇంటికి వచ్చింది. కానీ రాత్రి మహమూదా గుండెపోటు, వాంతులతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.