అత్యాచార నిందితుడితో యువతి అరెస్ట్‌.. బాధతో గుండె పగిలి.. | Woman Passed Away After Arresting Her With Molestation Accused | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడితో యువతి అరెస్ట్‌.. బాధతో గుండె పగిలి..

Published Thu, Jul 1 2021 10:31 AM | Last Updated on Thu, Jul 1 2021 10:39 AM

Woman Passed Away After Arresting Her With Molestation Accused - Sakshi

షానియా కొల్నిన్స్‌(19)

ఈడిన్‌బర్గ్‌ : అత్యాచార నిందితుడితో తనను అరెస్ట్‌ చేశారన్న ఆవేదనతో ఓ యువతి గుండె పగిలి మరణించింది. స్కాట్‌లాండ్‌లో 2020 డిసెంబర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై స్థానిక కోర్టు విచారణకు సిద్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2020 డిసెంబర్‌ 22న స్కాట్‌లాండ్‌, ఎబర్‌డీన్‌కు చెందిన యువతి షానియా కొల్నిన్స్‌(19)ను ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, 29 ఏళ్ల ఓ అత్యాచార నిందితుడితో తనను అరెస్ట్‌ చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన షానియాకు గుండెపోటు వచ్చింది.

దీంతో ఆమెను అంబులెన్స్‌లో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించింది. ఎబర్‌డీన్‌ షెర్రీఫ్‌ కోర్టు తాజాగా ఈ సంఘటనపై విచారణకు సిద్ధమైంది. ఆగస్టు 11వ తేదీన విచారణ చేయనుంది. కాగా, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement