సాక్షి, అమరావతి: ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ, ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.
సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుంది. సైలెన్స్ పీరియడ్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటినుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలన్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా ఈవీఎం మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలని సీఈవో తెలిపారు.
పోలింగ్ స్టేషన్‌లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్ కేంద్రాలోకి ఫోన్‌లకు అనుమతి లేదు. ఇప్పటివరకూ 269.28 కోట్లు నగదు,మద్యం,ఇతర అభరణాలు సీజ్ చేశాం. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉంటారు.
ఏపీఎస్పీ, కేంద్ర బలగాలు కలిపి మొత్తం 28,588 మంది విధుల్లో ఉన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌స్, మాజీ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీసులు 18,609 మంది ఉన్నారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు,ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు. 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు’’ అని సీఈవో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment