
గోదావరిఖని: సింగరేణిలో ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కార్పొరేట్ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం–1లో 11, రామగుండం–2లో ఆరు, రామగుండం–3లో ఆరు, భూపాల్‌పల్లిలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఐదు, మందమర్రిలో 11, శ్రీరాంపూర్‌లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజే రాత్రి ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికోసం కూడా ఎన్నికల లెక్కింపు కేంద్రాలను కార్మిక శాఖ ప్రకటించింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే..: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేకంగా 10 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొ త్తగూడెం ఏరియాలోని ఓట్లను రుద్రంపూర్ ఆర్సీవోఏ క్లబ్, ఇల్లెందు ఏరియా ఓ ట్లను ఇల్లెందు ఏరియా కమ్యూనిటీహాల్, మణుగూరు ఏరియాలో పీవీకాలనీ కమ్యూనిటీహాల్, రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2, 3 ఏరియాల ఓట్లను గో దావరిఖని సెక్టార్–1 కమ్యూనిటీ హాల్, భూపాల్‌పల్లి ఏరియా ఓట్లను కృష్ణ కాల నీ మినీ ఫంక్షన్‌హాల్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్‌షిప్, సీఈఆర్‌క్లబ్, మందమర్రి ఏరియా ఓట్లను మందమర్రి సీఈఆర్ క్లబ్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఓ ట్లను సీసీసీ ఎస్‌సీవోఏ క్లబ్, కార్పొరేట్‌లో హెడ్డాఫీస్ న్యూకాన్ఫరెన్స్‌హాల్, కార్పొరేట్ బూత్–5 ఓట్లను సింగరేణి భవన్ మూడో ఫ్లోర్‌లో లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment