సరిహద్దు గ్రామాల ప్రజల కోసం 4 పోలింగ్ కేంద్రాలు
చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 3,597 ఓటర్లు
కెరమెరి(ఆసిఫాబాద్): ఇటు తెలంగాణ.. అటు మ హారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం జిల్లా ఆసిఫా బాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చే కెరమెరి మండలంలోని 15 గ్రామాలకు చెందిన ఓటర్లు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తారు. పరంధోళి, నోకేవాడ, భోలాపటార్, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో 2,485మంది ఓటర్లు ఉన్నారు.
పరంధోళి పోలింగ్ కేంద్రం(పరంధోళి, తండా, కోటా, శంకర్‌లొద్ది, ముకదంగూడ)లో 1,367 మంది ఓటర్లు ఉండగా.. నోకేవాడ(మహారాష్ట్ర పోలింగ్ కేంద్రం)లో మహరాజ్‌గూడ ఓటర్లు 370, భోలాపటార్(¿ోలాపటార్, గౌరి, లేండిగూడ) 882, అంతాపూర్ పోలింగ్ కేంద్రం(నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్)లో 978మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి సుదీర్ మునగంటీవార్, కాంగ్రెస్ నుంచి ప్రతిభా థానోర్‌కర్ పోటీలో ఉన్నారు.
ఇప్పుడు వేసి ఊరుకుంటారా?
‘వన్ నేషన్..వన్‌రేషన్’లో భాగంగా ఒక ఓటరు ఒకేవైపు ఓటు వేయాలని ఇటీవల ఆయా గ్రామాల్లో అధికారులు అవగాహన కల్పించారు. అయితే చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్‌కు శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా, మే 13న ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్‌కు పోలింగ్ జరుగుతుంది. అయితే రెండువైపులా ఓటుహక్కు వినియోగించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment