Border village
-
‘మహా’ ఎన్నికల్లో మన ఓటర్లు
కెరమెరి(ఆసిఫాబాద్): ఇటు తెలంగాణ.. అటు మ హారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం జిల్లా ఆసిఫా బాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చే కెరమెరి మండలంలోని 15 గ్రామాలకు చెందిన ఓటర్లు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తారు. పరంధోళి, నోకేవాడ, భోలాపటార్, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో 2,485మంది ఓటర్లు ఉన్నారు. పరంధోళి పోలింగ్ కేంద్రం(పరంధోళి, తండా, కోటా, శంకర్‌లొద్ది, ముకదంగూడ)లో 1,367 మంది ఓటర్లు ఉండగా.. నోకేవాడ(మహారాష్ట్ర పోలింగ్ కేంద్రం)లో మహరాజ్‌గూడ ఓటర్లు 370, భోలాపటార్(¿ోలాపటార్, గౌరి, లేండిగూడ) 882, అంతాపూర్ పోలింగ్ కేంద్రం(నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్)లో 978మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి సుదీర్ మునగంటీవార్, కాంగ్రెస్ నుంచి ప్రతిభా థానోర్కర్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు వేసి ఊరుకుంటారా? ‘వన్ నేషన్..వన్రేషన్’లో భాగంగా ఒక ఓటరు ఒకేవైపు ఓటు వేయాలని ఇటీవల ఆయా గ్రామాల్లో అధికారులు అవగాహన కల్పించారు. అయితే చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్‌కు శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా, మే 13న ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్‌కు పోలింగ్ జరుగుతుంది. అయితే రెండువైపులా ఓటుహక్కు వినియోగించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. -
ఒకే ఇల్లు.. 4 గదులు తెలంగాణలో, 4 గదులు మహారాష్ట్రలో..
ముంబై/హైదరాబాద్: ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఇంట్లో నివసిస్తూ ఒక రాష్ట్రంలో భోజనం చేసి మరో రాష్ట్రంలో నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వినడాకిని వింతగా ఉన్నా.. ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు. మొత్తం 10 గదులున్నాయి. నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు గదులు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలకు ఈ కుటుంబం పన్ను కడుతోంది. అయితే పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తోందని వీళ్లు బాధపడటం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాహనాల రిజిస్టేషన్లను ఎంహెచ్, టీఎస్‌తో ఇనీషియల్స్‌తో చేయించుకుంటున్నారు. 1969 మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించినప్పుడు తమ ఇళ్లు రెండు రాష్ట్రాల కిందకు వచ్చిందని యజమానులు ఉత్తమ్ పవార్, చందు పవార్ చెబుతున్నారు. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. Maharashtra | A house in Maharajguda village, Chandrapur is spread b/w Maharashtra & Telangana - 4 rooms fall in Maha while 4 others in Telangana Owner, Uttam Pawar says, "12-13 of us live here. My brother's 4 rooms in Telangana&4 of mine in Maharashtra, my kitchen in Telangana" pic.twitter.com/vAOzvJ5bme — ANI (@ANI) December 15, 2022 ఇప్పటివరకు మహారాజగూడ గ్రామానికి మాత్రమే తెలిసిన ఈ ఇల్లు గురించి ఇప్పుడు దేశంలో అందిరికీ తెలిసింది. తమ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తమకెలాంటి ఇబ్బంది అన్పించడంలేదని పవార్ సోదరులు చెబుతున్నారు. తన నాలుగు గదులు మహారాష్ట్రలో, తన సోదరుడు చందు కుటుంబం నివసించే మరో నాలుగు గదులు తెలంగాణలో ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. తన కిచెన్ మాత్రం తెలంగాణలోనే ఉందన్నారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
ఆ వీధిలో ఒకవైపు ఆంధ్రా, మరోవైపు ఒడిశా ఇళ్లు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బలద పంచాయతీ కౌశల్యాపురం గ్రామమిది. ఈ గ్రామంలో కనిపిస్తున్న వీధిని ఒకసారి గమనించండి. వీధిలో ఉత్తరం వైపు ఉన్న ఇళ్లన్నీ ఒడిశావి కాగా, దక్షిణం వైపు ఉన్న ఇళ్లు ఆంధ్రావి. ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రా ఒడిశా కట్టుబాట్లు మిళితమై ఉంటాయి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ప్రాంతాల కలయికతో ఉన్న ప్రాంతమిది. మెళియాపుట్టి మండలంలోని రట్టిణి గ్రామమిది. ఇక్కడ ఎడమ వైపు ఇళ్లన్నీ ఒడిశా పరిధిలో ఉన్నాయి. కుడివైపు ఉన్న ఇళ్లన్నీ ఆంధ్రా పరిధిలోనివి. తెలుగు సంప్రదాయాలు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి ఉన్న గ్రామంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండు రాష్ట్రాల సరిహద్దును పంచుకుని ఉన్న ఈ గ్రామాలు సంప్రదాయాల్లో కూడా భిన్నత్వాన్ని చూపిస్తున్నాయి. పెళ్లిళ్లు, పూజల్లో తెలుగు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి కనిపిస్తుంటాయి. ఆంధ్రాలో ఉన్న దేవాలయాలను ఈ ప్రాంత ఒరియా వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఆంధ్రా ప్రజలు ఒరియా దేవాలయాలకు వెళ్తుంటారు. ఒరియా సంబంధించిన పండగలు చేసుకుంటారు. రెండు రాష్ట్రా ల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కలయికతో అన్నదమ్ముల్లా అక్కడి ప్రజలు ఉంటున్నారు. పూజల్లో ప్రత్యేకతలు రట్టిణిలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయానికి ఒడిశా వాసులు చైత్రమాసంలోని మొదటి నాలుగు మంగళవారాలు వస్తుంటారు. అదే ఆంధ్రాలో ఉన్న వారు ఎక్కువగా వైశాఖమాసంలో నాలుగు వారాల్లో మంగళ, ఆదివారాలలో వచ్చి పూజలు చేస్తుంటారు. ఆంధ్రా పరిధిలో ఉన్న వాళ్లు శుక్రవారం లక్ష్మిదేవిని పూజిస్తారు. కానీ ఒడిశా వారు గురువారం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. దీంతో ఒకే గ్రామ పరిధిలో గురువారం, శుక్రవారం రెండు రోజులు లక్ష్మీపూజలు జరుగుతాయి. ఒడిశా వాళ్లు గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసంగా భావించి నెల రోజులపాటు శివుడిని పూజిస్తుంటారు. ఆంధ్రా వాళ్లు దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీకమాసంగా పూజిస్తుంటారు. ఒడిశా సంప్రదాయానికి చెందిన వారంతా ప్రత్యేకంగా రాధాకృష్ణులను పూజిస్తారు. రాధామాధవస్వామి ఆరాధనతో 56 రకాల పిండివంటలతో భోగారాధన చేస్తారు. వీటితో పాటు శివుడు, ఇతర దేవుళ్లను పూజిస్తారు. ఎక్కువగా ఒడిశాలో అమావాస్య నుంచి అ మావాస్య వరకు మంచిరోజులుగా భావించి పూజ లు, శుభకార్యాలు చేస్తుంటారు. ఆంధ్రాలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మంచిరోజులుగా భావించి పూజలు, శుభకార్యాలు చేస్తుంటారు. ఫలితంగా ఈ గ్రామాల్లో అమావాస్య, పౌర్ణమి వారాలు నిత్యం పూజలు, శుభకార్యాలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఒకే గ్రామంలో భిన్న ఆధ్యాత్మిక సంస్కృతి కనిపిస్తుంది. కౌశల్యాపురంలో భూ వివాదం కౌశల్యాపురంలో 250 కుటుంబాల మధ్య భూ వివాదాలు 1969 నుంచి ఉన్నాయి. 37 ఎకరాలు పంట భూమి వివాదంలో ఉంది. భూములు వివాదంలో ఉన్నందున భూములు శిస్తులు చెల్లించడంలో రైతులు రెండు రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో ఇబ్బంది పడుతున్నారు. వివాదంలో ఉన్న భూము ల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణానికి ఒడిశా అధికారులు అడ్డుతగులుతున్నారు. కలిసిమెలిసి రట్టిణి, కౌశల్యాపురంలో ఆంధ్రా, ఒడిశా వాసులు పాఠశాలలు, దేవాలయాలకు కలిసి వెళ్తుంటారు. పండగలు కూడా కలిసి చేసుకుంటారు. పెళ్లిళ్లు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీధులే మారడంతో తమ్ముడు ఒడిశా పరిధిలో ఉంటే, అన్న ఆంధ్రా పరిధిలో ఉంటాడు. కూతుళ్ల పరిస్థితి కూడా అంతే. తండ్రి ఆంధ్రాలో ఉంటే...కూతురు ఒడిశా పరిధిలో ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన వారంతా ఒకే శ్మశానం వినియోగిస్తున్నారు. ఒడిశాకు చెందిన చెందిన పిల్లలు ఒరియా పాఠశాలకు వెళ్తా రు. ఆంధ్రాకు చెందిన పిల్లలు తెలుగు పాఠశాలలకు వెళ్తున్నారు. రెండింటిలోనూ తెలుగు, ఒరియా బోధన ఉంది. బయట వారు చెబితేనే.. ఒడిశా, ఆంధ్రా తేడా లేకుండా కలిసి మెలిసి ఉంటాం. ఒకే ఊరులో ఉండడం వల్ల మాకు రెండు రాష్ట్రాల ప్రజలమని అనిపించదు. బయట వారు వచ్చి చెబితే గానీ మాకు తెలియదు. – ప్రభాస్దాస్, రట్టిణి గ్రామం, మెళియాపుట్టి మండలం ఒరియా, తెలుగు బోధన ఒరియా, తెలుగు కలిపి ఒకే పాఠశాలలోనే చెబుతున్నాం. ఇద్దరు ఒరి యా ఉపాధ్యాయులు, ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలల అభివృద్ధి ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ ఒరియాకు తల్లిదండ్రులు ముందు ప్రాధాన్యత ఇస్తుంటారు. – జి.అప్పలస్వామి, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ పాఠశాల రట్టిణి -
ఓటు.. అటా ఇటా?
ప్రతి ఎన్నికల్లో ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో ఓటు వేసే అవకాశం ఉండే సరిహద్దులోని 12 వివాదాస్పద గ్రామాల ఓటర్లు ఈసారి మాత్రం ఒక చోటే ఓటు వినియోగించుకోగలరు. ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మహారాష్ట్ర, ప్రస్తుత తెలంగాణలో వేర్వేరు దశల్లో ఉండడంతో మొదట పోలింగ్ ఏ రాష్ట్రంలో జరిగితే అక్కడ ఓటు వేసే వారు. ఆ తర్వాత మరోచోట ఓటు హక్కు వినియోగించుకుని రెండుసార్లు ఓటు వేసే వారు. ఈసారి రెండు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. దీంతో మొదట ఎక్కడ వేస్తే అక్కడే ఓటు చెల్లుబాటు కానుంది. మొదట ఈ గ్రామస్తులు రెండుచోట్లా ఓటు వినియోగించుకుంటామని అధికారులకు విన్నవించారు. ఈ విషయాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఒకచోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని సీఈసీ స్పష్టం చేసింది. దీంతో గతంలో మాదిరిగా రెండుచోట్లా ఓటేసే వీల్లేకుండా పోయింది. అయితే ఈ గ్రామస్తులు మాత్రం తాము రెండుచోట్లా ఓటు వినియోగించుకుంటామని చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇక్కడి ఓటర్లకు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ, అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ లోక్‌సభ పరి«ధిలో ఒక్కొక్కరికి రెండేసి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలతో పాటు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ రెండుచోట్లా ఓటు వినియోగించుకున్నారు.- ఆకుల రాజు, సాక్షి– ఆసిఫాబాద్ ముందు మాకే ఓటేయండి.. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు పోలింగ్ ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమకే ముందు ఓటెయ్యాలని గ్రామస్తులను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం మండల కేంద్రం కెరమెరిలో ప్రచారానికి వచ్చిన ప్రస్తుత ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ మొదట తమకే ఓటు వేయాలని గ్రామస్తులను కోరారు. అటు చంద్రాపూర్ లోక్‌సభ బరిలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహెరి, కాంగ్రెస్ నుంచి సంజయ్ వామన్‌రావు ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ఈ నెల 11న జరిగే ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణ కొత్త పంచాయతీల ప్రకారం 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏళ్లుగా తేలని పంచాయితీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (1956) సమయంలో ప్రస్తుత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, బోలాపటార్, ముకదంగూడ గ్రామ పంచాయతీల పరిధిలోని పన్నెండు ఆవాసాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా విధానసభ నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో అప్పటి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ కింద ఈ భూభాగం కొనసాగింది. అయితే పూర్వ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర తొలిసారిగా 1987లో ఈ 12 ఆవాసాల్లోని పరందోళి, అంతాపూర్లను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలపగా.. సరిహద్దు పరిష్కారానికి 1988లో ఇరు రాష్ట్రాలు కేకే నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాల సేకరణ అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నా.. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవేనని కమిటీ తేల్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ 1995లో మొదటిసారిగా ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ముకదంగూడ గ్రామం తొలిసారి పరందోళి, అంతాపూర్కు ఏపీ నుంచి ఇద్దరు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అయితే మహారాష్ట్ర ఈ ఎన్నికలను అంగీకరించక.. మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చింది. దీనిని సవాల్ చేస్తూ అప్పటి చంద్రాపూర్ కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరేసి సర్పంచులు ఎన్నికవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఒకసారి మహారాష్ట్రకు, మరోసారి తెలంగాణకు సర్పంచులుగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పరందోళి గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ గతంలో తెలంగాణ తరఫున సర్పంచుగా పని చేశారు. మహారాష్ట్ర పరిధిలో రెండు పంచాయతీలు పరందోళి, అంతాపూర్ మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం వీటికి తోడు ముకుదంగూడ, బోలాపటార్ కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. పథకాలు, ఫలాలన్నీ డబుల్ రెండు రాష్ట్రాలు ఈ గ్రామాలకు పోటాపోటీగా అన్ని పథకాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి అటు మహారాష్ట్ర నుంచి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఇతర అన్ని రకాల పథకాలు ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అంతేకాక తమ భూభాగం అనిపించుకునేందుకు రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాయి. ప్రస్తుతం తెలంగాణ పరిధిలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, మహారాష్ట్ర రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉండడంతో రోడ్డు సౌకర్యం లేక జనం అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఉమ్రి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఒక్కటే దారి. అదింకా పూర్తికాక ఇబ్బందులు పడుతున్నారు. పోడు భూములు సాగు చేసే వారికి పట్టాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలు బాగున్నాయని చెబుతున్నారు. కొత్తగా రెండు పంచాయతీలు ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న 12 గ్రామాల పరిధిలో మొదటి పరందోళి జీపీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్ లొద్ది, లెండి జాల, పరందోళి తండా, మహారాజ్‌గూడ (ముకదంగూడ సగ భూ భాగం మహారాష్ట్రలో మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది) ఉన్నాయి. రెండో గ్రామ పంచాయతీ అంతాపూర్ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్, ముకదంగూడను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గ్రామాలు: 12 జనాభా: 9 వేలు ఓటర్లు: 2,663 సామాజిక వర్గాలు: మహర్, మాంగ్ (ఎస్సీ), లంబాడీ, ఆదివాసీ (ఎస్టీ), బీసీ. రెండుచోట్లా అవకాశం కల్పించాలి మేం రెండు రాష్ట్రాల్లో ఉన్నాం. మాకు రెండుచోట్లా గుర్తింపు కార్డులున్నందున రెండుచోట్లా ఓటు వేసే అవకాశం ఇవ్వాలి. గతంలో వేర్వేరు సమయంలో పోలింగ్ రావడంతో ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఒకేసారి రావడంతో ఎటు ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నాం. – కాంబ్లే లక్ష్మణ్ సర్పంచ్, పరందోళి (మహారాష్ట్ర) -
సరిహద్దు గ్రామం.. అభివృద్ధికి దూరం
తానూరు: మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్వత్ గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలైన అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు లేక గ్రామస్తులు ఇ బ్బందులెదుర్కొంటున్నారు. గ్రామం మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో దశాబ్దాలుగా ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవీ సమస్యలు.. తానూరు మండలంలో ఉన్న ఎల్వత్ గ్రామం మ హారాష్ట్రకు సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర కిలోమీటరు దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే మహారాష్ట్రలోని ధర్మాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగు కాలవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూకాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు రోడ్డుపై ప్రవహించి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. గ్రామంలో మురుగు కాలువలు లేక పోవడంతో పాత గ్రామం నుంచి మురుగు నీరు న్యూకాలనీలో చేరుతోంది. కాలనీలో గతంలో సీసీ రోడ్డు నిర్మించిన మురుగు కా లువలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు వాడిన మురుగు నీరు ఇంటి పరిసర ప్రాంతంలో నిల్వ ఉంటోంది. పాలకులు మారినా తమ గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకాలు నిరుపయోగం ఎల్వత్ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితం రూ. 23 లక్షలతో రక్షత మంచి నీటి పథకం నిర్మించి అంతర్గత పైప్‌లైన్ పనులు పూర్తిచేశారు. మోటారు ఏర్పాటు చేయకపోవడంతో నిర్మించిన పథకం ప్రారంభానికి నోచ్చుకోక నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామస్తుల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు పథకం ప్రారంభించి తాగు నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.కాలనీలో ఉన్న సింగిల్ ఫేజ్ మోటారుకు పైప్‌లు ఏర్పాటు చేసుకుని నీటిని తీసుకుంటున్నారు. రూ. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పథకంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. అధికారులు బోరుమోటారు ఏర్పాటు చేసి పథకం ఉపయోగంలో తీసుకువస్తే గ్రామస్తుల తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. నాసిరకంగా సీసీ రోడ్ల పనులు ఎనిమిది సంవత్సరాల క్రితం న్యూకాలనిలో అధికారులు రూ.లక్షలు ఖర్చుచేసి సీసీ రోడ్డు పనులను చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేయడంతో రోడ్లు పగుళ్లు తేలి, గుంతలు పడి అధ్వానంగా మారి నడవలేని స్థితిలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక సంబందిత కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ రోడ్లు నిర్మించిన అధికారులు డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్డుపై పారుతోంది. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ కాల్పులతో తీవ్రంగా నష్టపోతున్నాం
-
మారని తలరాత
సరి‘హద్దు’ మీరిన సమస్యలు నరకానికి నకళ్లు ఆ రహదారులు పడవలు, తెప్పలే ప్రయాణ సాధనాలుబడులూ లేవు, దవాఖానా లేదుతలాపునే నీళ్లు, దాహం తీరదు వానాకాలం వణుకుడు,ఎండాకాలం ఉడుకుడు అభివృద్ధి నిధుల మంజూరు శూన్యమే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు దాటింది. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామీణ భారతం మాత్రం ఆవిష్కృతం కాలేదు. ఇప్పటికీ చాలా వరకు పల్లెలు సమస్యల చక్రబంధంలో ఇరుక్కుని ఉన్నాయి. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామన్న ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నీటి మూటలేనని అవి నిరూపిస్తున్నాయి. నిజామా బాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఊళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రహదారులు లేవు. తాగడానికి నీళ్లు లేవు. చదువుకోవడానికి బడులు లేవు. రోగమొస్తే చూపించుకోవడానికి దవాఖాన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఎవ్వరికీ పట్టని జనావాసాలు. ఇక్కడి దీనస్థితిపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. - బాన్సువాడ పడేసినట్లున్న ఊళ్లు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గ్రామాలు. వీటికి కూతవేటు దూరంలో, మహారాష్ట్ర, కర్ణాటకలోని గ్రామాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలు, మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల గ్రామాలన్నీ సరిహద్దుకే ఆనుకొని ఉన్నాయి. ముఖ్యంగా జుక్కల్ మండలంలోని బాబుల్ గాం, శక్తినగర్, చింతల్‌వాడి, చింతల్‌వాడి తాండ, హట్యానాయక్ తాండ, కంగ్టి మండలంలోని బోర్గి, చౌకన్పల్లి తదితర గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బడా సమస్యల బాబుల్‌గాం బాబుల్‌గాం గ్రామం ద్వీపకల్పంలా ఉంది. ఈ గ్రామాన్ని మూడు వైపులా కౌలాస్‌నాలా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆవరించి ఉంది. ఏడాదికి 12 నెలలూ ఇదే పరిస్థితి. బా బుల్గాం నుంచి విఠ ల్వాడికిగానీ, జుక్కల్కుగానీ వెళ్లాలంటే వానాకాలంలో 60 కిలోమీటర్లు, ఎండాకాంలో 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిందే. వాస్తవానికి బాబుల్‌గాం నుంచి జుక్కల్‌కు పది కిలోమీటర్ల దూరమే ఉన్నా, కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తోపాటు రోడ్డు సరిగా లేక ఆ గ్రామ ప్రజలు 50 కిలోమీటర్లు అధికంగా తిరగాల్సి వస్తోంది. వర్షాకాలంలో కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండితే బాబుల్‌గాం పూర్తిగా మునిగినట్టే. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతారు అక్కడి ప్రజలు. ఈ గ్రామానికి మండలస్థాయి అధికారులు ఎవరూ రారు. ఎప్పుడైనా వస్తే వారు రోజంతా ఇక్కడే గడపాలి. మరో రెండు రోజులు సెలవు పెట్టాలి. అయితేనే ఆ గ్రామానికి చేరుకొంటారు. గ్రామం చెంతనే కేఎన్పీ బ్యాక్‌వాటర్ ఉన్నా, బోర్లు మాత్రం పని చేయవు. రాళ్లతో కూడిన రహదారిపై కాలి నడకన వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. బడి ఉన్నా పేరుకే..ఉపాధ్యాయులు లేరు. దవాఖానా లేదు. రోగమొస్తే తెప్పలెక్కి పట్టణానికి పోవలసిందే. తండాల పరిస్థితీ అంతే! బాబుల్‌గాం సమీపంలో ఉండే హట్యానాయక్ తాండ, చింతల్‌వాడి తాండ, చౌకన్పల్ల తాండాలలో గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అవి క్షేత్ర స్థాయిలో అందడం లేదనడానికి ఈ తండాలే నిదర్శనం. తాగునీటి కోసం ఈ తండాల వా సులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లా కంగ్టీ మండలం చౌకన్పల్లికి వెళ్తున్నారు.రాష్ట్రంలోనే వెనుకబడి ఉన్న జుక్కల్ సెగ్మెంట్లోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గోజెగాం గ్రామం మద్నూర్ మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, లెండి వాగు అడ్డంగా ఉండడంతో గ్రామస్తులు 30 కిలోమీటర్ల వరకు తిరిగి, మహారాష్ట్ర ద్వారా మద్నూర్‌కు వస్తున్నారు. గోజెగాం వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గం గారాం హయాంలో కోటి రూపాయలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నిధులను లింబూర్-మద్నూర్ రోడ్డు నిర్మాణానికి మళ్లించారు. దీం తో గ్రామస్తుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతం పనులు మందకొడిగా సాగుతున్నాయి. జుక్కల్ మండలంలోని బాబుల్‌గాం, శక్తినగర్, చింతల్‌వాడి గ్రామాలు ప్రతీ వర్షాకాలంలో కౌలాస్‌నాలా బ్యాక్ వాటర్‌తో జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.