Akhilesh Yadav.. బీహార్‌లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు నితీష్‌కు ప్లాన్ చేస్తన్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఇంట తేజస్వీ యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా.. బీహార్‌లో రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా పొలిటికల్ చర్చ నడుస్తోంది. తాజాగా నితీష్ కుమార్ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. "ఇది మంచి ప్రారంభం. నాడు 'అంగ్రేజో భారత్ చోడో'(ఆంగ్లేయులకు భారత్ నుంచి తరిమి కొట్టండి) నినాదం ఇవ్వబడింది. నేడు బీహార్ నుండి 'బీజేపీ భగావ్'(బీజేపీని వెళ్లగొట్టండి) అనే నినాదం వస్తోంది. త్వరలోనే రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని నేను భావిస్తున్నాను." అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. నితీష్ కుమార్ రాజీనామాపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ.. బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. ఇది నితీష్ జీ తీసుకున్న నిర్ణయం. మేము(బీజేపీ) ఎల్లప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని అనుసరిస్తాము. కూటమి గౌరవాన్ని కాపాడుతున్నాము" అని అన్నారు.
It's a good start. On this day the slogan of 'Angrezo Bharat Chhodo' was given and today the slogan of 'BJP Bhagaon' is coming from Bihar. I think soon political parties and people in different states will stand against BJP: SP chief Akhilesh Yadav on political situation in Bihar pic.twitter.com/UXhlfWAhDx
— ANI (@ANI) August 9, 2022
ఇది కూడా చదవండి: హీటెక్కిన బీహార్ పాలిటిక్స్.. తేజస్వీ యాదవ్‌కు కీలక పదవి!
Comments
Please login to add a commentAdd a comment