
వేదికపై కూర్చుంటున్న ములాయంకు సాయంచేస్తున్న అఖిలేశ్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చాన్నాళ్ల తరువాత ఒకే వేదికను పంచుకున్నారు. పార్టీలో చీలిక వచ్చిన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ సైకిలు ర్యాలీ ముగింపు కార్యక్రమంలో అఖిలేశ్‌తో కలసి ములాయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో పాటు, ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేలా పనిచేయాలని ఎస్పీ కార్యకర్తలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment