
ఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ మిగతా వారికంటే ముందుగానే అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. అయోధ్య మేయర్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ గుల్షన్ బిందు పేరును సమాజ్ వాదీ పార్టీ ఖరారు చేసింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో తమ గెలుపు ఖాయమని ఈ సందర్భంగా గుల్షన్ పేర్కొన్నారు.
హామీలు అమలు చేయలేని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె తెలిపారు. వచ్చే నెల 21, 22, 29 తేదీల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలను డిసెంబర్ ఒకటో తేదీన ప్రకటిస్తారు. కాగా మీరట్- దీప్ మనేతియా వల్మీకిని, బరైలీ- ఐఎస్ తోమర్‌ను, అలీగఢ్- ముజాహిద్ కిద్వాయి, ఝాన్సీ- రాహుల్ సక్సేనాను, గోరఖ్‌పూర్- రాహుల్ గుప్తాను, మొరాదాబాద్- యూసఫ్ అన్సారీని అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment