యూపీలో బీజేపీని ఢీకొట్టే ఎస్‌పీ అభ్యర్థులు వీళ్లే.. | Lok Sabha Elections 2024 Full List Of SP Candidates Fighting Polls In UP | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీని ఢీకొట్టే ఎస్‌పీ అభ్యర్థులు వీళ్లే..

Published Thu, Mar 7 2024 2:31 PM | Last Updated on Thu, Mar 7 2024 3:11 PM

Lok Sabha Elections 2024 Full List Of SP Candidates Fighting Polls In UP - Sakshi

ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP) 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రస్తుతానికి 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌తోపాటు ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుత మైన్‌పురి ఎంపీగా ఉన్న డింపుల్‌ యాదవ్‌ మరోసారి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లక్నో, అంబేద్కర్ నగర్ స్థానాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు రవిదాస్ మెహ్రోత్రా, లాల్జీ వర్మలను పార్టీ పోటీకి దింపింది.

ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి బలమైన పక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో గట్టి పొత్తులో ఉంది. అనేక విడతల సమావేశాల తర్వాత, రెండు పార్టీలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని కీలక రాష్ట్రాల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒక అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం యూపీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా మిగిలిన 63 స్థానాలు ఎస్పీ ఖాతాలో ఉన్నాయి.

2019లో 80 సీట్లలో 62 సీట్లను బీజేపీ గెలుచుకుంది. జనరల్ వీకే సింగ్ తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సురేష్ బన్సాల్‌పై 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో జనరల్‌ వీకే సింగ్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్ బబ్బర్‌పై 5,67,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది 2008లో నమోదైన సంచలన రికార్డు.

ఇప్పటివరకు ఎస్‌పీ ప్రకటించిన అభ్యర్థులు వీళ్లే..
అభ్యర్థి:                    లోక్‌సభ స్థానం
డింపుల్ యాదవ్:       మెయిన్‌పురి
కాజల్ నిషాద్:            గోరఖ్‌పూర్
రామ్ ప్రసాద్ చౌదరి:  బస్తీ
లాల్జీ వర్మ:                 అంబేద్కర్ నగర్
అవధేష్ ప్రసాద్:       ఫైజాబాద్
శివశంకర్ సింగ్ పటేల్: బండా
రాజా రామ్ పాల్:        అక్బర్‌పూర్
నావల్ కిషోర్ శాక్య:     ఫరూఖాబాద్
అన్నూ టాండన్:       ఉన్నావ్
ఆనంద్ భదౌరియా:   ధౌరహర
ఉత్కర్ష్ వర్మ:             ఖిరి
ధర్మేంద్ర యాదవ్:     బదౌన్
దేవేష్ శక్య:                ఏటా
అక్షయ్ యాదవ్:        ఫిరోజాబాద్
రవిదాస్ మెహ్రోత్రా: లక్నో
అఫ్జల్ అన్సారీ:           ఘాజీపూర్
రాజేష్ కశ్యప్:              షాజహాన్‌పూర్
ఉషా వర్మ:                  హర్దోయ్
ఆర్‌కే చౌదరి:             మోహన్‌లాల్‌గంజ్
ఎస్‌పీ సింగ్ పటేల్:   ప్రతాప్‌గఢ్
రమేష్ గౌతమ్:          బహ్రైచ్
శ్రేయ వర్మ:               గోండా
వీరేంద్ర సింగ్:          చందౌలీ
రాంపాల్ రాజవంశీ:  మిస్రిఖ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement