
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత.. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురుతో లవ్ ట్రాక్ నడిపాడు. అంతేకాకుండా ఆమెకు ఇటీవలే పెళ్లి ఖాయం కావడంతో ఇద్దరూ పారిపోయాడు. దీంతో, ఈ ఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. బీజేపీ నేత అశిశ్ శుక్లా(47), సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే, శుక్లాకు అప్పటికే వివాహమై.. 21 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. దీంతో, ఆమె లవ్ ట్రాక్ వివాదాస్పందగా మారింది. మరోవైపు.. పారిపోయిన సదరు యువతికి ఇటీవలే మరో వ్యక్తికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె.. శుక్లాతో పారిపోవడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు కూడా వాగ్వాదాలకు దిగారు. దీంతో, వీరి లవ్ ట్రాక్ యూపీలో సంచలనంగా మారింది.
ఇదిలా ఉండగా.. ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగరానికి బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం.. శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్టు హర్దోయ్ జిల్లా మీడియా ఇన్‌చార్జ్ గంగేశ్ పాఠక్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment