love triangle
-
రాజకీయ ప్రత్యర్థి కూతురితో బీజేపీ నేత ప్రేమాయణం..
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత.. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురుతో లవ్ ట్రాక్ నడిపాడు. అంతేకాకుండా ఆమెకు ఇటీవలే పెళ్లి ఖాయం కావడంతో ఇద్దరూ పారిపోయాడు. దీంతో, ఈ ఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అశిశ్ శుక్లా(47), సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే, శుక్లాకు అప్పటికే వివాహమై.. 21 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. దీంతో, ఆమె లవ్ ట్రాక్ వివాదాస్పందగా మారింది. మరోవైపు.. పారిపోయిన సదరు యువతికి ఇటీవలే మరో వ్యక్తికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె.. శుక్లాతో పారిపోవడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు కూడా వాగ్వాదాలకు దిగారు. దీంతో, వీరి లవ్ ట్రాక్ యూపీలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగరానికి బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం.. శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్టు హర్దోయ్ జిల్లా మీడియా ఇన్చార్జ్ గంగేశ్ పాఠక్ వెల్లడించారు. -
ముక్కోణపు ప్రేమకథ.. లాయర్‌ను చంపేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ముక్కోణపు ప్రేమ కథ ఒకరి ప్రాణాలు బలి తీసుకోగా, మరో ఇద్దర్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. మాజీ ప్రియుడిని దక్కించుకునేందుకు కోసం అతడి ప్రస్తుత ప్రియురాలని మాజీ ప్రేయసి దారుణంగా చంపేసింది. ముగ్గురూ ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే అయినా వివేకంగా కోల్పోయి రాక్షసంగా ప్రవర్తించారు. వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన జుహీ ప్రసాద్ లాయర్. ఆమె పుణెకు చెందిన నీమేష్ సిన్హాను ప్రేమించేది. ఆమె కంటే ముందు నీమేష్..అనుశ్రీ కుంద్రా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ప్రేమించాడు. 2011 నవంబర్‌లో నీమేష్ ఫొన్ చేసి రమ్మనడంతో జుహీ పుణె వెళ్లింది. అతని ప్లాట్‌లో వారిద్దరూ ఓ రోజు గడిపారు. మరోసటి రోజు ఉదయం అనుశ్రీ నీమేష్ ప్లాట్‌కు వెళ్లి బెడ్రూంలో నిద్రిస్తున్న జుహీపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో జుహీ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నీమేష్ ప్రమేయం కూడా ఉందని, పథకం ప్రకారమే తన కుమార్తెను చంపేశారని జుహీ తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీమేష్.. జుహీని కనీసం రక్షించేందుకు కూడా ప్రయత్నించలేదని, లేకుంగా కాలిన గాయాలతోనైనా తన కుమార్తె ప్రాణాలతో బయటపడేదని తెలిపారు. ఈ ముక్కోణపు కథ, హత్యపై విచారణ చేయాల్సిందిగా ముంబై హైకోర్టు పోలీసులను ఆదేశించింది.