ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్‌కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్‌కు టిక్కెట్‌ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్‌కు కేటాయించింది.
మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్‌ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి.
Comments
Please login to add a commentAdd a comment