
లక్నో: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రెండు రామ ద్రోహులని, వారి డీఎన్‌ఏలోనే రామ ద్రోహముందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేత రాధికా కేరాను కాంగ్రెస్ అవమానించిందన్నారు.
అవమానం భరించలేకే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసిందన్నారు. ‘కాంగ్రెస్ నిజస్వరూపం దేశ ప్రజలందిరికీ తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్లు చేసేదేది నిజం కాదు. కేవలం ప్రజలను మోసం చేయడానికి వాళ్లు ఏదైనా చేస్తారు.
ప్రజలు వాళ్ల నాటకాల పట్ల జాగ్రత్తగా ఉంటారు’అని యోగి వార్తా సంస్థతో అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రామునికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అయోధ్య వెళ్లినందుకే పార్టీ తనను అవమానించిందని ప్రకటించి రాజీనామా చేశారు.