
కారు నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యం
బనశంకరి: పెళ్లికి వెళ్తున్న వారిపై మృత్యువు పంజా విసిరి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. ఈఘటన బెళగావి జిల్లా నిప్పాణి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను నిప్పాణికి చెందిన అదగొండ బాబుపాటిల్(60), భార్య ఛాయా అదగొండపాటిల్(55), ఛాయా తల్లి మగదమ్ (80), మహేశ్‌దేవగోండపాటిల్(23)గా గుర్తించారు. బెళగావిలో జరిగే వివాహానికి వీరు కారులో శుక్రవారం కొల్లాపుర నుంచి వెళ్తుండగా నిప్పాణి శివారులో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. నిప్పాణి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చేరుకుని మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నిప్పాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
(చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?)
Comments
Please login to add a commentAdd a comment