four members died
-
పెళ్లికి వెళ్తుండగా మృత్యుపంజా
బనశంకరి: పెళ్లికి వెళ్తున్న వారిపై మృత్యువు పంజా విసిరి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. ఈఘటన బెళగావి జిల్లా నిప్పాణి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతులను నిప్పాణికి చెందిన అదగొండ బాబుపాటిల్(60), భార్య ఛాయా అదగొండపాటిల్(55), ఛాయా తల్లి మగదమ్ (80), మహేశ్దేవగోండపాటిల్(23)గా గుర్తించారు. బెళగావిలో జరిగే వివాహానికి వీరు కారులో శుక్రవారం కొల్లాపుర నుంచి వెళ్తుండగా నిప్పాణి శివారులో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. నిప్పాణి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చేరుకుని మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం నిప్పాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?) -
వారి కళ్లు మళ్లీ చూడబోతున్నాయ్!
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా దామెర క్రాస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఐదుగురు యువకుల్లో నలుగురి నేత్రాలు దానం చేసేందుకు మృతుల కుటుంబ సభ్యులు ముందు కొచ్చారు. ప్రమాదం జరగగానే సహాయక చర్యలు చేపట్టిన ఏసీపీ పి.శ్రీనివాస్ నేత్రదానం వల్ల కలిగే ప్రయోజనాలపై మృతుల కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చనిపోయిన వారు భౌతికంగా కనిపించకపోయినా వారి కళ్లు ఈ ప్రపంచాన్ని చూసే గొప్ప అవకాశం నేత్రదానం వల్ల సాధ్యమవుతుందని వివరించారు. దీంతో మృతులు జయప్రకాశ్, గజవెల్లి రోహిత్, కండబోయిన నరేష్, మేకల రాకేష్ కుటుంబాలు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఈ మేరకు సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రి సిబ్బంది ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వద్ద మృతుల నేత్రాలను సేకరించారు. -
శోకసంద్రంలో వల్లూర్
మనూరు(నారాయణఖేడ్): కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలోని జావర్గి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగల్గిద్ద మండలం వల్లూర్‌కు చెందిన నలుగురు వ్యక్తుల మృతదేహాలు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గ్రామానికి చెందిన మేత్రి లక్ష్మి(40), ఆమె మనువడు సాయి(02)తోపాటు గొల్లపద్మ(35), సునిత(06) మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టు వెంట్రుకలకోసం అని వెళ్లీ, ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. దశప్ప భార్య అయిన పద్మ దంపతులకు ముగ్గురు సంతనం ఉన్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో దశప్ప భార్య పద్మ(35)చిన్న కూతరు అయిన సునిత(06) మరణించారు. -
గుండెలు పగిలేలా..
నలుగురు విద్యార్థుల మృతితో తల్లిదండ్రుల రోదన మృతుల గ్రామాల్లో అలముకున్న విషాదం ప్రత్తిపాడు/పెదనందిపాడు/వట్టిచెరుకూరు: కన్నకొడుకును ప్రయోజకుడిగా చూడాలన్న ఓ తల్లి కలలు కల్లలయ్యాయి. తనయుడిపైనే కోటి ఆశలు పెట్టుకున్న మరో నాన్న ఆశలు అడిఆశలయ్యాయి. కొడుకును ఉన్నతునిగా తీర్చిదిద్దాలన్న ఇంకొక తండ్రి ఆకాంక్ష చెదిరిపోయింది. కన్నకొడుకే శ్వాసగా బతుకుతున్న మరో తల్లికి గర్భశోకమే మిగిలింది... ఇలా విధి ఆ అభాగ్యుల కుటుంబాలపై క్వారీకుంట రూపంలో విషం చిమ్మింది. గుంటూరురూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలోని క్వారీ కుంటలో ఈతకు దిగి నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న కొడుకులను కాటికి సాగనంపాల్సి రావడంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ఒక్కసారి లేనాన్న.. ఒక్కసారి లే బిడ్డా.. నీ కోసమే కదా ఈడ దాకా వచ్చాం.. అంటూ పందిరి సాయితేజ (14) కుటుంబం బోరున విలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పందిరి అప్పారావు, అమ్మన్న దంపతులు సుమారు పదహారేళ్ల క్రితం గుంటూరురూరల్ మండలం చౌడవరం వలస వచ్చారు. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేసుకుంటూ కూతురు, కుమారుడు సాయితేజను చదివించుకుంటున్నారు. కుమారుడి మృతితో వారి రోదించడం వారిని కంటతడి పెట్టించింది. కంటికి రెప్పలా పెంచి.. కంటికిరెప్పలా పెంచుకున్నాడు. తనకున్నదానిలో అడిగినవన్నీ ఇచ్చాడు. గారాభంగా చూసుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. గుంటూరురూరల్ మండలం జూనంచుండూరు గ్రామానికి చెందిన కనపర్తి మాణిక్యరావు, కనకాంబరం దంపతులు వ్యవసాయకూలీలు. వీరికి కుమార్తె తిరుమల దేవి, కుమారుడు మహేష్ ఉన్నారు. కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతోంది. కొడుకు మహేష్‌ను ఇంగ్లీషుమీడియం చదివిస్తున్నారు. మహేష్ మృతితో తండ్రి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. కొడుకు మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని పదేపదే ముద్డాడుతూ ఆ తండ్రి తన ప్రేమను చాటడం అక్కడున్న వారందరికీ కన్నీటిని తెప్పించింది. చివరి ఆశగా.. కన్నకొడుకు కళ్ల ఎదుటే నిర్జీవంగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి. ఒక్కసారి లేరా అభి.. మా నాన్నవి కదూ ఒక్కసారి లే.. అంటూ గుండెలపై తడుతూ అభిషేక్ తల్లి రోధించిన తీరు స్థానికుల మనసులను కలిచివేసింది. కొన ఊపిరి ఉందేమో అని చివరి ఆశగా కొడుకు గుండెలపై కొడుతూ ఆ తల్లి ప్రయత్నాలు చేయడం స్థానికుల గుండెలను పిండేసింది. గుంటూరురూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్ చుక్కా నానిబాబు, చిట్టి మరియమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కొడుకు అభిషేక్ మరణించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారి చూడయ్యా.. ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా.. నీ కోసమే బతుకుతున్నాం.. ఆ దేవుడు మమ్మల్ని తీసుకోపోకుండా నిన్ను తీసుకుపోయాడు.. అంటూ జూనంచుండూరుకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు, విజయ దంపతులు బోరున విలపించారు. వీరికి కుమార్తె, కుమారుడు గోపీచంద్ ఉన్నారు. తండ్రి ఆటో నడుపుకుంటూ ఇద్దరినీ చదివిస్తున్నాడు. గోపీచంద్ మరణించడంతో వారి బాధ మాటల్లో చెప్పలేకుండా ఉంది. -
అర్ధరాత్రి వేళ.. మృత్యుహేల
కిచ్చన్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం.. 10 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను సంగారెడ్డి, హైదరాబాద్‌కు తరలింపు మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారే జోగిపేట: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన అందోలు మండలం కిచ్చన్నపల్లి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారు. వివరాలిలా ఉన్నాయి. నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా దొన్గెడ్, వాడీ, షీకాద, సోన్‌పేట గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలు సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని తిరుమలకు క్రూసర్ వాహనంలో బయలుదేరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మిబాయికి గత సంవత్సరం ఏఎన్ఎంగా ఉద్యోగం రావడంతో పాటు దిలీప్, ఉజ్వలల కొడుకు తల వెంట్రుకలు తీయాలన్న మొక్కును తీర్చుకునేందుకే వీరు తీర్థయాత్రలకు బయలుదేరినట్లు సమాచారం. కిచ్చన్నపల్లి గ్రామ బస్జేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి నాందేడ్ అకోలా జాతీయ రహదారి పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పులియాబాయి (55) భార్య భర్తలైన సంజయ్ రాథోడ్ (35), లక్ష్మిబాయి (30 ) అక్కడికక్కడే మృతి చెందారు. పులియాబాయి వెనుక సీటులో నుంచి ముందు సీటులోకి వచ్చి సీట్లమధ్య ఇరుక్కుపోయి మరణించింది. ముందు సీటులో కూర్చున్న సంజయ్రాథోడ్కు తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. క్రూసర్ వాహనం డ్రైవర్ నర్సింగ్ (40)ను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనలో సుమీత్, కవితల కాళ్లు విరిగిపోగా, మాషన్, అక్షర, స్వప్న, విద్య, దిలీప్ రాథోడ్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉజ్వల అనే మహిళ చెంపకు గాయం అయ్యింది. ప్రదీప్‌నాయక్, దిలీప్ రాథోడ్, మహేదేవ్లకు కూడా గాయాలు కావడంతో వారిని సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రులకు అంబులెన్స్‌లో తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో పల్టీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పెద్దాపూర్ గ్రామానికి చెందిన కిష్టాగౌడ్కు గాయాలు కాగా, డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటయ్య, ఎస్ఐ శ్రీధర్, పోలీసు సిబ్బందితో సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. ఉజ్వల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టి.శ్రీధర్ తెలిపారు. -
నిర్మాణంలో ఉన్న ఆర్చ్ కూలి నలుగురు మృతి