నేత్రాలను చూపిస్తున్న ఏసీపీ శ్రీనివాస్
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా దామెర క్రాస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఐదుగురు యువకుల్లో నలుగురి నేత్రాలు దానం చేసేందుకు మృతుల కుటుంబ సభ్యులు ముందు కొచ్చారు. ప్రమాదం జరగగానే సహాయక చర్యలు చేపట్టిన ఏసీపీ పి.శ్రీనివాస్ నేత్రదానం వల్ల కలిగే ప్రయోజనాలపై మృతుల కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చనిపోయిన వారు భౌతికంగా కనిపించకపోయినా వారి కళ్లు ఈ ప్రపంచాన్ని చూసే గొప్ప అవకాశం నేత్రదానం వల్ల సాధ్యమవుతుందని వివరించారు. దీంతో మృతులు జయప్రకాశ్, గజవెల్లి రోహిత్, కండబోయిన నరేష్, మేకల రాకేష్ కుటుంబాలు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఈ మేరకు సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రి సిబ్బంది ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వద్ద మృతుల నేత్రాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment