ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ టగ్‌ట్రక్ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు చెప్పాయి.
గ్రౌండ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్‌ట్రక్ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్ దిబ్బతింది. ఫ్లైట్ కిందిభాగం ట్రక్‌కు తగలడంతో ల్యాండింగ్ గేర్ వద్ద టైర్ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్ట్ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment