అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోరం చోటుచేసుకుంది. భావ్‌నగర్ జిల్లాలోని పిపవావ్ పోర్టు నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న ట్రక్కు ధోలేరా నగరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున బోల్తా కొట్టడంతో 19 మంది ప్రాణాలుకోల్పోయారు. ప్రమాద సమయంలో ట్రక్కులో 25 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు అహ్మదాబాద్ ఎస్పీ అసారి తెలిపారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో సిమెంట్ బస్తాల కింద నలిగిపోయి 19 మంది ప్రాణాలు విడిచారని ఆయన పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు 12 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడనీ, అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment