workers dead
-
ఊటీలో ఘోర ప్రమాదం
చెన్నై: తమిళనాడు పర్యాటక ప్రాంతం ఊటీలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Six construction workers died on the spot while undergoing house construction work at Lovedale, near Ooty in Tamil Nadu "Two workers with serious injuries taken to Ooty Government Hospital, one worker missing under the debris, rescue operations underway, say Police. pic.twitter.com/NkrUFxw0TU — ANI (@ANI) February 7, 2024 -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
ట్రక్కు బోల్తా.. 19 మంది దుర్మరణం
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోరం చోటుచేసుకుంది. భావ్‌నగర్ జిల్లాలోని పిపవావ్ పోర్టు నుంచి సిమెంట్ లోడుతో వస్తున్న ట్రక్కు ధోలేరా నగరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున బోల్తా కొట్టడంతో 19 మంది ప్రాణాలుకోల్పోయారు. ప్రమాద సమయంలో ట్రక్కులో 25 మంది కార్మికులు ప్రయాణిస్తున్నట్లు అహ్మదాబాద్ ఎస్పీ అసారి తెలిపారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో సిమెంట్ బస్తాల కింద నలిగిపోయి 19 మంది ప్రాణాలు విడిచారని ఆయన పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు 12 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడనీ, అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి
బొమ్మనహళ్లి : మురికి నీటి ట్యాంక్ శుభ్రం చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి అందక మృతి చెందిన సంఘటన బొమ్మనహళ్లి హెచ్ఎస్ఆర్ లేఔట్ సామసంద్ర పాళ్యలో ఉన్న ఎన్.డి. సెఫల్ అపార్టుమెంటులో ఆదివారం చో టు చేసుకుంది. మృతులు తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నాగసంద్ర గ్రా మానికి చెందిన మాదేగౌడ (45), కోలా రు జిల్లా శ్రీనివాసపుర తాలూకా యగువపాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ స్వామి (38), సామసంద్రపాళ్యకు చెందిన పేయింటర్ శ్రీనివాస్ (52)గా గుర్తించారు. వీరు ఇక్కడి సామసంద్రపాళ్యలో నివాసం ఉంటున్నారు. అసలు విషయానికి వస్తే వీరికి మురికి ట్యాంకులు శుభ్రం చేయడం తెలియదు. మాదేగౌడ గార్మెంట్స్‌లో ఉద్యోగి కాగా, నారాయణ స్వామి ఎలక్ట్రీషియన్, శ్రీనివాస్ పెయింటర్. ఆదివారం సెలవు కావడంతో ఇక్కడి ఎన్డీ సెఫల్ అపార్టుమెంట్లో మురికినీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఉదయం ముగ్గురు మురికి నీటి ట్యాంకులోకి దిగారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వీరికి అనుభవం లేకపోవడంతో వీరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అపార్టుమెంట్ నిర్వాహకులు విషయం గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమా చారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి, శోభా స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇదే సమయంలో మంత్రి జార్జ్‌తో పాటు మేయర్ సంపత్ రాజ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ కూడా ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే మార్చురీ వద్ద సామసంద్రపాళ్య గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బాధ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
-
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. అసలు కల్చరల్ క్లబ్లో నిర్మిస్తున్నది భవనం కాదని, అది కేవలం పోర్టికో అని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదస్థలిని జీహెచ్ఎంసీ క్లూస్ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్, ఇసుకను సేకరించింది. బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ పరిశీలించారు. కార్మిక శాఖ ద్వారా బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదంపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో విపత్తులు ఎదురైతే ఎదుర్కోవడానికి సరైన సిబ్బంది లేరని, ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. పేద కూలీలను ఆదుకోవాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్.. కూలీల మృతి?
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కనిగిరి మండలం విశ్వనాథపురంలో ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలి పలువురు కూలీలు మరణించారు. పొగాకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అందులో ఉన్న కూలీలు ఎటూ తప్పించుకోడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రమాదం సంభవించే సమయానికి ట్రాక్టర్లో దాదాపు 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంతమంది క్షేమంగా బయటపడగలిగారో మాత్రం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.