ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. అసలు కల్చరల్ క్లబ్లో నిర్మిస్తున్నది భవనం కాదని, అది కేవలం పోర్టికో అని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదస్థలిని జీహెచ్ఎంసీ క్లూస్ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్, ఇసుకను సేకరించింది