మహారాష్ట్రలో ఘోర ప్రమాదం | 17 Killed As Truck Hits Barricade In Maharashtra Khandala | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

Published Tue, Apr 10 2018 8:42 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

17 Killed As Truck Hits Barricade In Maharashtra Khandala - Sakshi

సాక్షి, ముంబయి: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర దుర్ఘటన మరవకముందే మహారాష్ట్రలోనూ మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఖండాలలోని  పూణె-సతరా జాతీయ రహదారిపై  ఓ ట్రక్‌ అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ల కంగ్రా జిల్లా నూర్‌పూర్‌ ప్రాంతంలో నిన్న (సోమవారం) ఓ స్కూల్‌ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా 10ఏళ్ల లోపు చిన్నారులే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement