రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
కందుకూరు (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత వారం రోజులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 'సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం' సోమవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలతో అలరించారు.