మానుగుంట మహిధర్ రెడ్డి, పోతుల రామారావు
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థిని ఎంచుకునే బాధ్యత కూడా ఓటర్లపై ఉంది. ఏ పార్టీ అయితే తమకు మేలు చేస్తుంది, ఎవరైతే తమకు అండగా ఉండి తమ సంక్షేమాన్ని, అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తారో వారిని ఎన్నుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గుణగణాలు ఇలా...
సుపరిచితం మానుగుంట చరితం
► నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి
► దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం.
► మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌రెడ్డి ఒకసారి మంత్రిగాను పనిచేశారు.
► నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు.
► అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు.
► రాజకీయాల్లో ఎంత ఎదిగినా సొంత ఊరిని వదిలని నేతగా గుర్తింపు, ఇప్పటికీ గ్రామంలో సామాన్యుడిగానే నివసిస్తున్నారు.
► సాదారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు.
► ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయగల నేర్పరి
► ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
► కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారే మంచి పేరు
► అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారనే భావన, నమ్మకం ఉన్న నేత.
► నియోజకవర్గంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు.
► సమస్యపై ఎవరి వెళ్లినా ముక్కుసూటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు
► ప్రజా సమస్యలపై పోరాడటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయడంలో బహు ప్రజ్ఞాశాలి
► సంఘ విద్రోహ శక్తులను దరి చేరనీయరు.
► పాలనలో పరాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అవగాహన, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన నాయకుడు.
రాజకీయ అందలం నుంచి పోతుల రామారావు
► సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
► సమీప నియోజకవర్గం కొండపి గ్రామానికి చెందిన నేత. స్థానికుడు కాదు
► రాజకీయాలను వ్యాపార దృక్పధంలోనే వినియోగిస్తారని ఉంది.
► ఎమ్మెల్యేగా నియోజకవర్గం కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు.
► ముభావి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించని నేతగా గుర్తింపు.
► అధికారంలో ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేదు.
► విషయంలో చురుగ్గా ఉండరనే ముద్ర
► ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఉన్నా పాలన అంతా ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల చేతుల్లోనే సాగుతుంది,
► సమస్యలపై వెళ్లే ప్రజలు ముందుగా కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి
► వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా విదేశాల్లో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment