pothula ramarao
-
మహీధరుడి సేవాభావం.. పోతుల స్వలాభం
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థిని ఎంచుకునే బాధ్యత కూడా ఓటర్లపై ఉంది. ఏ పార్టీ అయితే తమకు మేలు చేస్తుంది, ఎవరైతే తమకు అండగా ఉండి తమ సంక్షేమాన్ని, అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తారో వారిని ఎన్నుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గుణగణాలు ఇలా... సుపరిచితం మానుగుంట చరితం ► నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ► దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం. ► మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌రెడ్డి ఒకసారి మంత్రిగాను పనిచేశారు. ► నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు. ► అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు. ► రాజకీయాల్లో ఎంత ఎదిగినా సొంత ఊరిని వదిలని నేతగా గుర్తింపు, ఇప్పటికీ గ్రామంలో సామాన్యుడిగానే నివసిస్తున్నారు. ► సాదారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు. ► ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయగల నేర్పరి ► ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ► కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారే మంచి పేరు ► అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారనే భావన, నమ్మకం ఉన్న నేత. ► నియోజకవర్గంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. ► సమస్యపై ఎవరి వెళ్లినా ముక్కుసూటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ► ప్రజా సమస్యలపై పోరాడటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయడంలో బహు ప్రజ్ఞాశాలి ► సంఘ విద్రోహ శక్తులను దరి చేరనీయరు. ► పాలనలో పరాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అవగాహన, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన నాయకుడు. రాజకీయ అందలం నుంచి పోతుల రామారావు ► సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ► సమీప నియోజకవర్గం కొండపి గ్రామానికి చెందిన నేత. స్థానికుడు కాదు ► రాజకీయాలను వ్యాపార దృక్పధంలోనే వినియోగిస్తారని ఉంది. ► ఎమ్మెల్యేగా నియోజకవర్గం కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ► ముభావి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించని నేతగా గుర్తింపు. ► అధికారంలో ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేదు. ► విషయంలో చురుగ్గా ఉండరనే ముద్ర ► ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఉన్నా పాలన అంతా ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల చేతుల్లోనే సాగుతుంది, ► సమస్యలపై వెళ్లే ప్రజలు ముందుగా కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ► వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. -
మీడియాను చూసి నాలుక్కరుచుకున్న మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కందుకూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారపార్టీ కుట్రలు, కుతంత్రాలు, బరితెగింపు, బెదిరింపులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడబోమని నిరూపిస్తున్నారు. తాము అనుసరించబోయే అక్రమ కార్యకలాపాల వ్యూహమేంటో చెప్పకనే చెబుతున్నారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైతే రౌడీయిజం చేద్దాం. దాంట్లో తప్పేమి లేదంటూ బహిరంగంగానే ప్రకటించి’ తమ నైజాన్ని చాటుకున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేసిన వ్యాఖ్యలే.. వారి దుష్ట వ్యూహాలను బయటపెట్టాయి. ఎమ్మెల్యే పోతుల రామారావు సాక్షిగా..శివరాం చేసిన ఈ వ్యాఖ్యలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నం.. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ప్రభంజనంలా వీస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పటికే వందల మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీకి గుడ్‌బై చెప్పి, మాజీ మంత్రి, కందుకూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు పార్టీ ఫిరాయించి, టీడీపీలో చేరడంతో.. అప్పటి వరకు పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. పార్టీలో అసంతృప్తులు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఆ అసంతృప్తులు నేటికీ చల్లారడం లేదు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అటు పార్టీని కాపాడుకోవడంతోపాటు ఇటు ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎన్నికల రోజు ఎలాగైనా అల్లర్లు సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శివరాం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రౌడీయిజం చేసైనా ఎన్నికల్లో గెలుద్దామని బహిరంగంగా కార్యకర్తలకు చెబుతూ.. మీడియా ఉందని గమనించి నాలుక్కరుచుకున్నారు. దీంతో కందుకూరులో పాత రోజులు మళ్లీ పునరావృతమవుతాయా అంటూ చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికలొస్తున్నాయ్.. త్వరగా పని కానిచ్చేయండి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నొటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనుల జోలికి వెళ్లని చంద్రబాబు సర్కారు ఎన్నికల వేళ వేల కోట్ల రూపాయల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులను పట్టించుకోని ప్రభుత్వం నేడో రేపో ఎన్నికలనగా అన్ని చేసేస్తామంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నానికి దిగారు. మార్చి నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఫలకాల జోరు.. ఒంగోలు నగర పరిధిలో రెండో డివిజన్ కేశవరాజుగుంటలో పోతురాజు కాలువ నుంచి న్యూ హైవే వరకు రూ.2.58 కోట్లతో రోడ్డు విస్తరణ పనులంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోడ్డు అభివృద్ధి పనులు ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి. రెండో డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు న్యూహైవే నుంచి ముదిగొండవాగు వరకు మరో రూ.1.07 కోట్లతో రోడ్డు పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. భాగ్యనగర్ 4వ లైను పదో అడ్డరోడ్డులో రూ.2 కోట్లతో కాపు సంక్షేమ భవన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.22.40 కోట్లతో కరువది నుంచి గుండాయపాలెం, కరవది నుంచి కొప్పోలు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. 24వ డివిజన్ సమైఖ్య నగర్లో రూ.30 లక్షలతో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగముక్కల పాలెంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయగా వెంగముక్కలపాలెం జంక్షన్ నుంచి భగీరధ కెమికల్ ఫ్యాక్టరీ వరకు రూ.3 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం పనులకు మార్చి 5, 6, 7 తేదీల్లో శంకుస్థాపనలు చేయడం గమనార్హం. ఐదేళ్లపాటు వీటి జోలికి వెళ్లని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనల తంతు చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరిలోనూ ఇదే తీరు.. కనిగిరిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల శంకుస్థాపనల జోరు సాగిస్తున్నారు. కనిగిరిలో రూ.189 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కనిగిరి తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు ఐదేళ్ల పాలనా కాలం చివరిలో గుర్తుకు రావడం గమనార్హం. సీఎస్‌పురం మండలంలో ఆర్అండ్బీ నుంచి బోడావులదిన్నె వరకు రూ.43.93 లక్షలతో తారు రోడ్డు పనికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోనూ పెదరాజుపాలెం నుంచి ఎగువపల్లివరకు రూ.1.35 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కోనపల్లి నుంచి బోయమడుగులకు రూ.63 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. డీజీ పేట నుంచి బొంతువారిపల్లి వరకు రూ.3.60 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇదే మండలంలో పలు సీసీ రోడ్లు నిర్మాణాలకు సైతం గత రెండు మూడు రోజుల క్రితం శంకుస్థాపనలు చేశారు. ఇదే మండలంలో బీసీ వసతి గృహ భవన నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఆ భవనం నిర్మాణానికి నోచుకోక పోవడం గమనార్హం. పామూరు మండలంలో కంభాలదిన్నె నుంచి రేణుమడుగు వరకు రూ.4.29 కోట్లతో తారు రోడ్డు పనికి ఇటీవలే శంఖుస్థాపన చేయగా రూ.2.72 కోట్లుతో రజాసాహెబ్‌పేట తారు రోడ్డు పనికి, బోడవాడ నుండి అక్కంపేట వరకు రూ.3.05 కోట్లతో తారు రోడ్డు పనికి రూ.1.74 కోట్లతో రేగుచెట్లపల్లి తారు రోడ్డుకు ఎమ్మెల్యే ఇటీవలే శంకుస్థాపన చేశారు. • అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రూ.85 కోట్లతో గుండ్లకమ్మ నుంచి అద్దంకి పట్టణానికి నీరందించే పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. • దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌కు మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దొనకొండ మండలంలోని వెంకటాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, రాగమక్కపల్లిలో చిన్న తరహా పరిశ్రమలకు, దర్శిలో 1000 జీప్లస్2 గృహాలకు ఇటీవల మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోని అధికార పార్టీ ఎన్నికల సమయంలో శంకుస్థాపనలకు దిగడంపై విమర్శలు ఉన్నాయి. • గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లిలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి 132/32 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలలుగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు మొదలయ్యాయి. గురువారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయడం గమనార్హం. • పర్చూరు నియోజకవర్గంలో మార్చి 4న కారంచేడులో రూ.3.80 కోట్లతో మంచినీటి పథకానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంఖుస్థాపన చేశారు. ఫిబ్రవరి 25న రూ.11.45 కోట్లతో యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి, అనంతవరం, వింజనం పాడు, చిలుకూరివారిపాలెం, యద్దనపూడి, వెన్నవరం గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ భవనాలకు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తొండివాగుపై బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకొల్లులో రూ.40 లక్షలతో అన్నా క్యాంటీన్ కోసం ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంకొల్లు చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ కోసం రూ.50 లక్షల పనికి శంకుస్థాపన చేశారు. • కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ వద్ద రూరల్ మండలంలో తాగునీటి సరఫరా కోసం నీటి పథకానికి ఎమ్మెల్యే పోతుల రామారావు శంఖుస్థాపన చేశారు. అలాగే రూ.37 లక్షలతో కందుకూరు పట్టణంలో డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో షాదీఖాన కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అధికార పార్టీ హడావుడిపై విమర్శలు.. వాస్తవానికి గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను గాలికి వదిలేసింది. కనిగిరి నిమ్జ్. దొనకొండ పారిశ్రామికవాడలకు ఎప్పుడో శంకుస్థాపనల శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి వాటి ఊసులేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఐదేళ్లుగా ఈ హామీ నెరవేరలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేయగా మిగిలి ఉన్న 5శాతం పనులను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైనా ఇప్పటికి కనీసం భవనాలు ఏర్పాటు చేసి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బాబు సర్కారు ఉండి పోయింది. పాత హామీలను పక్కన పెడితే ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు, ఏషియన్ పేపర్ పరిశ్రమలు నిర్మిస్తామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఊసేలేదు. అవన్నీ పక్కనపెట్టి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావిడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎమ్మెల్యే పోతుల కారు ఢీకొని వృద్ధ దంపతుల మృతి
గన్నవరం: ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు ఢీకొని బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో వృద్ధ దంపతులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ బయలుదేరిన ఎమ్మెల్యే గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగి ఇద్దరు దుర్మరణం పాలైనా పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఆటోలో విమానాశ్రయానికి వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎమ్మెల్యే పోతుల రామారావు నడుపుతున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామానికి చెందిన పొట్ట హరినారాయణరెడ్డి (67), సీతామహాలక్ష్మి (62) దంపతులు కంకిపాడులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ముస్తాబాద మీదుగా కేసరపల్లి వచ్చి బైపాస్ వద్ద జాతీయ రహదారి దాటసాగారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే పోతుల రామారావు కారు అతివేగంగా స్కూటీని ఢీకొని, జాతీయ రహదారి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. తలకు తీవ్రగాయాలైన సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న హరినారాయణరెడ్డిని చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సీతామహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు నడిపిందెవరు? ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎమ్మెల్యే నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే గన్‌మెన్ సహాయంతో డ్రైవర్ సీటులో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. కారు దిగిన ఎమ్మెల్యే వెంటనే గన్‌మెన్‌తో కలిసి ఆటోలో విమానాశ్రయానికి వెళ్లిపోయారని చెప్పారు. ఆయన అనుచరులు కొందరు అసలు ఎమ్మెల్యే కారులోనే లేరని బుకాయించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే ఉన్నట్లు అంగీకరించిన డ్రైవర్ ఏడుకొండలు వాహనాన్ని ఎవరు నడుపుతున్నారని అడిగితే మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పోలీసులు సైతం టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎం.కొండలరావుపై కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు విజయవాడ ఈస్ట్‌జోన్ ఏసీపీ వి.విజయ్‌భాస్కర్ తెలిపారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
పోతుల కస్సు.. దివి బుస్సు
కందుకూరు అర్బన్: కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఇద్దరూ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రామారావు కస్సుమంటే, శివరాం బుస్సు మంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా దివి శివరాం రెండేళ్లపాటు కొనసాగారు. ఆ రెండేళ్లలో కార్యకర్తలను విస్మరించారని, కొంతమందినే చేరదీశారనేది ఆ పార్టీ కార్యకర్తల ఆరోపణ. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలే ధ్యేయంగా అభివృద్ధిని పాతాళానికి తొక్కారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదీ అభివృద్ధి..? అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేశారు. టీడీపీ కండువా కప్పుకొని 15 నెలలు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త నిధులు మంజూరు సంగతి దేవుడెరుగు కనీసం ఉన్న నిధులు కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మూడు నెలల క్రితం రూ.10 కోట్లకు టెండర్లు పిలవగా ఎమ్మెల్యే కాంట్రాక్ట్లర్లను పిలిచి రూ.5 కోట్లకు టెండర్లు వేసుకోవాలని, మిగిలిన 5 కోట్ల టెండర్లు తమ కార్యకర్తలకు ఇస్తామని సూచించినట్టు తెలిసింది. ఇది తెలిసిన శివరాం తన మనుషులతో టెండర్లు వేయించారు. దీంతో రామారావు ఆ టెండర్లను రద్దు చేయించారు. శివరాం అనుచరులను కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదే స్థాయిలో రామారావు కూడా తమ వర్గం జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇద్దరు బయటకు ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటూనే మరో వైపు పార్టీ సమావేశాలు జరిగిన ప్రతి సారీ తమ అనుచరులతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయించుకొంటున్నారు. దీంతో కందుకూరు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పోర్టు సాధనలో విఫలం.. రామాయపట్నం పోర్టు వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడి దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఇతర వ్యాపారాలు పెరుగుతాయి. దీంతో కందుకూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రమే నిర్ణయించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు రామాయపట్నం పోర్టు వచ్చేలాగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది పోయి అసలు పట్టించుకోవడంలేదనేది ప్రజల ఆరోపణ. సందిగ్ధంలో ఉద్యానవన కళాశాల.. గుడ్లూరు మండలంలో చినలాటిపి గ్రామంలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు చేయాలని 235 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఏడాది నుంచి తరగతులు మొదలు కావాల్సి ఉంది. ఆరు నెలలవుతున్నా కళాశాల కమిటీ సభ్యులు మూడు సార్లు సందర్శించి వెళ్లారు. తరగతులు ప్రారంభించడానికి, విద్యార్ధులు ఉండటానికి వసతి గృహాలను, గుడ్లూరు, కందుకూరులో పరిశీలించారు. ఇప్పటికి ఎమ్మెల్యే, శివరాం చర్యలు తీసుకోలేదు. నత్తనడకన సోమశిల ఉత్తరకాలువ... సోమశిల ఉత్తకాలువ నత్తనడకన సాగుతోంది. ఈ కాలువ పూర్తయితేనే రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న భూమలు సస్యశ్యామలమవుతాయి. పదేళ్లుగా కా>లువ నిర్మాణం ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. మూలిగేనక్కపై తాటికాయ పడినట్టు కాలవ పనులు పూర్తి కాకా నీళ్లే రాకపోతే రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి 1.5 టీఎంసీ నీటిని కొండాపురం మండలం చింతలదీవి వద్ద ఉన్న కామథేనువు ప్రాజెక్ట్ తరలింపునకు ప్రభుతం మంజూరు చేసినా జీవో 40 రాళ్లపాడు ప్రాజెక్టు రైతులకు కనీళ్లు తెప్పిస్తోంది. ఈ జీవో రద్దు చేయించడంలో ఇద్దరు నాయకులు విఫలం చెందారు. పత్తాలేని పార్కు... గత ప్రభుత్వంలో రామతీర్ధం జలాశయం మంచినీటి పధకం పక్కన కోటి రూపాలయ నిధులతో పార్కు పనులు మొదలు పెట్టారు అది పిల్లర్లు దశలోనే ఆగిపోయింది. పట్టణంలో చేపల మార్కెట్ సమీపంలో రూ. 50 లక్షలతో మటన్ మార్కెట్ నిర్మించాలని భూమిపూజ చేశారు. అది అంతటితోనే ఆగిపోయింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిక మించేందుకు ఓవీ రోడ్డులోని మాల్యాద్రి కాలనీ మీదుగా పామూరు ప్రశాంతి నగర్ సమీపం వరకు బైపాస్‌రోడ్డు మంజూరైంది. ఇప్పటికి అది కూడా కార్యరూపం దాల్చలేదు. -
జగన్‌తో రాష్ట్రాభివృద్ధి
టంగుటూరు, న్యూస్‌లైన్ : జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ పోతుల రామారావు అన్నారు. స్థానిక ఏటీసీ ఆవరణలో బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చారని పోతుల చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో కొనసాగడం తనకు ఇష్టం లేదన్నారు. ఇక నుంచి అందరం వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేద్దామని పోతుల చెప్పగానే కార్యకర్తలంతా చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు. 2004-2009 కాలంలో దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా తాను కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేశానని, తిరిగి ఆయన తనయుడు జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీలో పని చేయాల్సి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు గతంలో కంటే మరింతగా కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుదామన్నారు. గ్రామాల్లో కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి గెలిచే అభ్యర్థులను బరిలోకి దించాలని పోతుల సూచించారు. భారత టుబాకో బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ పోతుల వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. తామంతా పోతులతోనే ఉంటామని, అందరం పార్టీ విజయానికి ఐక్యంగా పాటుపడదామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక లో కార్యకర్తలు ఐక్యత చాటాలని అయ్యవారయ్య కోరారు. పోతులకు కార్యకర్తల ఘన స్వాగతం ఎమ్మెల్సీ పోతుల రామారావును వైఎస్సార్సీపీలో చేర్చుకునేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి గ్రీన్‌సిగ్న ల్ వచ్చిన తర్వాత మొదటి సారిగా టంగుటూరు వస్తున్న పోతుల రామారావుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అం దరూ టోల్గేట్ వద్దకు చేరకుని పోతులకు ఎదురేగారు. అక్కడి నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా స్థానిక ఏటీసీ వద్దకు చేరుకున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల నరసింహారావు, వల్లూరమ్మ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్లు సూరం రమణారెడ్డి, ఉప్పలపాటి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.