టంగుటూరు, న్యూస్‌లైన్ : జననేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ పోతుల రామారావు అన్నారు. స్థానిక ఏటీసీ ఆవరణలో బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఆ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి గ్రీన్‌సిగ్నిల్ ఇచ్చారని పోతుల చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌లో కొనసాగడం తనకు ఇష్టం లేదన్నారు. ఇక నుంచి అందరం వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేద్దామని పోతుల చెప్పగానే కార్యకర్తలంతా చప్పట్లతో తమ సమ్మతి తెలిపారు.
2004-2009 కాలంలో దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా తాను కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేశానని, తిరిగి ఆయన తనయుడు జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీలో పని చేయాల్సి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు గతంలో కంటే మరింతగా కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుదామన్నారు. గ్రామాల్లో కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి గెలిచే అభ్యర్థులను బరిలోకి దించాలని పోతుల సూచించారు. భారత టుబాకో బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ పోతుల వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. తామంతా పోతులతోనే ఉంటామని, అందరం పార్టీ విజయానికి ఐక్యంగా పాటుపడదామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక లో కార్యకర్తలు ఐక్యత చాటాలని అయ్యవారయ్య కోరారు.
పోతులకు కార్యకర్తల ఘన స్వాగతం
ఎమ్మెల్సీ పోతుల రామారావును వైఎస్సార్‌సీపీలో చేర్చుకునేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి గ్రీన్‌సిగ్న ల్ వచ్చిన తర్వాత మొదటి సారిగా టంగుటూరు వస్తున్న పోతుల రామారావుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అం దరూ టోల్‌గేట్ వద్దకు చేరకుని పోతులకు ఎదురేగారు. అక్కడి నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా స్థానిక ఏటీసీ వద్దకు చేరుకున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల నరసింహారావు, వల్లూరమ్మ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్లు సూరం రమణారెడ్డి, ఉప్పలపాటి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.