Manugunta Mahidhar Reddy
-
దేవాదయ భూముల పరిరక్షణపై రాజీపడేది లేదు
-
రైతుల సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం
కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ఆలోచనా విధానాల ఆధారంగానే రైతుల జీవితాలు మారతాయని, క్షేత్ర స్థాయి నుంచి రైతుల జీవితాలను మెరుగు పర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను సాగులో వినియోగించాలని చెప్పారు. గతేడాది చెరువుల నిండా నీరున్నా.. వరి సాగు చేసేందుకు రైతులు ముందు రాలేదని గుర్తు చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదన్నారు. ఆర్బీకేలు సంపూర్ణ రైతు సేవా కేంద్రాలుగా మారాయన్నారు. సీహెచ్‌సీ గ్రూపుల ద్వారా రూ.15 లక్షల విలువైన పనిముట్లను అందుబాటులో ఉంచుతుందని, నిరుద్యోగులైన వ్యవసాయ పట్టభద్రులకు రూ.10 లక్షల విలువైన కిసాన్ డ్రోన్లను సరఫరా చేస్తుందని తెలిపారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్ పడిందని, ఎక్కడా కూడా నకిలీ విత్తనం అనే మాట వినిపించడం లేదన్నారు. కందుకూరు ప్రాంతంలో వరి, శనగ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేశామని, తాజాగా జొన్నల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంద్యాలలో పండే రకం జొన్నను ఈ ప్రాంత రైతులు సాగు చేసి విజయం సాధించారని తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటైందన్నారు. రూ.2,738 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు రూ.1000 నుంచి రూ.1500 వరకు ధాన్యం కొనుగోళ్లలో నష్టపోవాల్సి వచ్చిందని, అటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి జొన్నలు ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ ఎస్.పవన్‌కుమార్, వ్యవసాయశాఖ ఏడీఏ శేషగిరి, ఏఓ అబ్దుల్‌రహీం, నాయకులు గణేశం గంగిరెడ్డి, వసంతరావు, ఎం శ్రీనివాసులు, గేరా మనోహర్, కామాక్షినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పాలనను చూడలేకే కుట్రలు
కందుకూరు: ఏడాది పాలనలోనే చెప్పింది చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనను చూసి ఓర్వలేకే ప్రభుత్వంలో అసంతృప్తులు అంటూ టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మండిపడ్డారు. నిజానికి.. వయస్సు అయిపోయిన చంద్రబాబువల్ల తమ భవిష్యత్ ఏంటో అర్ధంకాక ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉందన్నారు. తనకెలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ఇంకెంత మంది వెళ్లిపోతారో అర్ధంకాని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంలో అసంతృప్తులు అంటూ తమపై అసత్య వార్తలు రాస్తున్నారని సోమవారం ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. తన నియోజకవర్గంలో మంచినీటి పథకాలకు సంబంధించి విడుదల కావాల్సిన బిల్లులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న జడ్పీ సీఈఓను ప్రశ్నించానన్నారు. దీన్ని కొందరు ప్రభుత్వ వ్యతిరేక చర్యగా చూపించే ప్రయత్నం చేశారని మహీధర్‌రెడ్డి అన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం ఎలా తప్పవుతుందని, వారితో సక్రమంగా పనిచేయించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని వివరించారు. అలాగే, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు జీఓ విడుదల చేయడమే కాకుండా, మాచవరం వద్ద మన్నేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు, వీఆర్‌కోట సప్లై చానల్ అభివృద్ధికి రూ.18 కోట్లు, కరేడు ఆనకట్ట అభివృద్ధికి రూ.8 కోట్లు ఇలా నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎంపై తనకెందుకు అసంతృప్తి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. -
తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్!
సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై వైఎస్సార్సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!) -
అవాస్తవాలను రాస్తే చట్టపరమైన చర్యలు
-
తప్పుడు రాతలపై ఎమ్మెల్యే సీరియస్..
సాక్షి, ఒంగోలు: తనపై కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తాను అసంతృప్తిగా ఉన్నానంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని.. అందుకే ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. (ఇసుక విక్రయాలు మరింత పారదర్శకం..) ఏ సీఎం చేయని గొప్ప కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గంలో కూడా అడిగినవన్నీ చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో కొందరు కిందస్థాయి అధికారులు పనిచేయడం లేదని, బిల్లులు చేయమని మాత్రమే నిలదీశానన్నారు. తప్పుడు రాతలు రాసే పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి హెచ్చరించారు. (ప్రజారంజక పాలన చూసి ఓర్వలేకే దుష్ప్రచారం) -
మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!
సాక్షి, ఒంగోలు : మేం చెప్పినట్లు చేయాల్సిందే.. మాట వినకపోతే శాల్తీ గల్లంతే.. రెవెన్యూ రికార్డులు మా పేర్ల మీద మార్చండి.. లేదంటే మీ అంతు చూస్తాం.. అంటూ మండల మెజిస్ట్రేట్‌పై కబ్జాదారులు బెదిరింపులకు దిగారు.. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడింది అధికార పార్టీ నేతలో, వారి అనుయాయులో కాదు.. గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములను ఆక్రమించి బ్యాంకుల్లో కోట్ల రూపాయల లోన్లు తీసుకుని అధికారిక దందా నడిపిన టీడీపీ నేతలు. అధికారం కోల్పోయినా వీరి తీరు మాత్రం మారలేదనడానికి లింగసముద్రం మండలంలో జరిగిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు అధికంగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని 40 రెవెన్యూ బృందాలతో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో టీడీపీ నేతల కబ్జా పర్వం బయటపడుతుండటంతో రికార్డులు మార్చాలంటూ తహసీల్దార్‌పై బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనను బదిలీ చేయాలంటూ ఆర్డీఓ, కలెక్టర్‌కు విన్నవించారు. కబ్జాదారులు తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారంటూ బహిరంగ సమావేశంలోనే తహసీల్దార్ వాపోయారంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నేతలు ప్రకాశం జిల్లా, లింగసముద్రం మండలంలో పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారుల ద్వారా ఆన్లైన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు లోన్లు పొందారు. పెదపవని గ్రామంలో టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న ఓ మాజీ వీఆర్ఓ ఒక్కడే 17 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనేది బహిరంగ రహస్యమే. ఐదేళ్లలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టారంటే టీడీపీ నేతలు ఏస్థాయి దందాకు పాల్పడ్డారో అర్థమౌతుంది. ముఖ్యంగా మండలంలోని పెదపవని, తిమ్మారెడ్డిపాలెం, మొగిలిచర్ల, లింగసముద్రం, మాలకొండరాయునిపాలెం గ్రామాల్లో వాగు, కుంట, కాలువ, గయాలు, ఏడబ్ల్యూ, పశువుల మేత పోరంబోకులు, శ్మశానాలను సైతం వదలకుండా కబ్జా చేసేశారు. అప్పట్లో ఈ వ్యవహారం బయటపడినప్పటికీ కొందరిపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించిన టీడీపీ నేతల జోలికి మాత్రం వెళ్లని పరిస్థితి. దీంతో ఇప్పటికీ ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ సర్వేలో భాగంగా కలెక్టర్ పోల భాస్కర్ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కువగా ఉన్న లింగసముద్రం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 40 రెవెన్యూ బృందాలను మండలంలో మోహరింపజేయడంతోపాటు కలెక్టర్ స్వయంగా అక్కడకు వెళ్లి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. కబ్జా భాగోతాలు బయటకు రావడంతో తహసీల్దార్‌పై బెదిరింపుల పర్వం: రెవెన్యూ బృందాల పరిశీలనలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. జిల్లా కలెక్టర పర్యవేక్షణలో సర్వే జరుగుతుండటంతో ఇక తమను కాపాడేవారు లేరని భావించిన టీడీపీ నేతలు కొందరు రెవెన్యూ రికార్డులు మార్చి తమ పేర్లు చేర్చాలంటూ తహసీల్దార్ రాఘవస్వామిపై బెదిరింపులకు దిగారు. చెప్పినట్లు వినకపోతే శాల్తీ గల్లంతేనంటూ హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన తహసీల్దార్ తనకు కబ్జా దారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను బదిలీ చేయాలంటూ కందుకూరు ఆర్డీవో ఓబులేసు, కలెక్టర్ పోల భాస్కర్ల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనను బెదిరించిన వారి పేర్లు చెప్పేందుకు కూడా ఆయన బయపడుతున్న పరిస్థితి. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదంటే టీడీపీ నేతలు తహసీల్దార్‌ను ఏస్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలో మరో ఘటన జరగకుండా అక్రమార్కులకు హెచ్చరిక పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
రా‘మాయ’పట్నమేనా..!
సాక్షి, ఉలవపాడు: రామాయపట్నం పోర్టు.. జిల్లా వాసుల కల.. కానీ ఈ కలను నెరవేర్చడం సంగతి పక్కనపెడితే రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయంకు గురిచేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ పోర్టుకు సంబంధించిన నిర్ణయాలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నికలు వస్తున్నాయని తెలిసి జనవరి 9న హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుంది అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. రెండు నెలల్లో పోర్టు పనులు ప్రారంభం అవుతాయి అని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు. ఆ తరువాత ఆ విషయమే పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా ప్రజల్లో బలంగా ఉంది. ఎన్నికల సమయంలో బాబు చేసిన ఈ భూమిపూజ ప్రభుత్వ అనుమతులతో జరిగిందా లేక పబ్లిసిటీ కోసం చేశారా అనే అయోమయంలో జిల్లా ప్రజలున్నారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు గత పదేళ్లుగా అధికార, ప్రజాప్రతినిధుల ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. రెండు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయి అని గత ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో నేటి వరకు ఆ ఊసేలేదు. కనీసం రెవెన్యూ అధికారులు సర్వే కూడా ప్రారంభించలేదు. సర్వే లేకుండా, భూ సేకరణచేయకుండా, పరిహారం గురించి నిర్ణయం తీసుకోకుండా గత ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడిగా భూమిపూజ చేసింది తప్ప పనులు చేయాలన్న ఉద్దేశమే లేదని ప్రజలకు అర్థమైపోయింది. కానీ పోర్టు నిర్మాణం అయోమయాలకు గురి చేస్తున్న పరిస్థితుల్లో నిజం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఈ శాసన సభ సమావేశాల్లో రామాయపట్నం పోర్టుపై ప్రశ్నించనున్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేసి నియోజకవర్గ అభివృద్ధికి పోర్టు ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 2012 జనవరి నుంచి పోర్టు కోసం పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. పోర్టు నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక బృందంను పరిశీలనకు పంపింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మహీధరరెడ్డి, నాటి కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి పరిస్థితిని వివరించారు. వారు ఈ ప్రాంతం అనువుగా ఉందని కూడా తెలిపారు. కానీ తదనంతర పరిణామాలు ప్రకాశం జిల్లా వాసులను ఇబ్బందులకు గురిచేశాయి. దుగ్గరాజుపట్నంకు తరలింపు, తరువాత అక్కడ అనుమతులు లేక నిలుపుదల, ఇక్కడ చిన్నపోర్టు అని ప్రకటన, రాష్ట్రం లేఖ ఇవ్వలేదని కేంద్రం చెప్పడం, కేంద్రం ఇవ్వలేదని రాష్ట్రమే నిర్మిస్తుందని భూమి పూజ చేయడం.. ఇలా అంతా అయోమయంగా నడిచింది. అనుమతులు ఉండే భూమి పూజ చేశారా...? ఈ ఏడాది జనవరి 9న గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసింది. కానీ ఈ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోర్టు నిర్మించాలంటే ముందుగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి అనుమతులు రావాలి. ఈ పోర్టు పరిధిలో అటవీశాఖ భూమి ఉంది కాబట్టి అటవీశాఖ నుంచి అనుమతులు రావాలి. ప్రారంభ సమయానికి ఇలాంటి అనుమతులు ఏమీ లేకుండానే భూమి పూజ చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు కు కేంద్రం సుముఖతగా ఉన్నా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇవ్వకుండా తామే భూమి పూజ చేసి నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన ఈ ప్రక్రియ వలన ఉపయోగం ఉందా అనే ఆలోచనలో ప్రజలున్నారు. -
వైఎస్ జగన్ హామీతో ధర్నా విరమించిన ఎమ్మెల్యే
సాక్షి, ప్రకాశం : రాళ్లపాడు ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా సంఘటనకు సంబంధించి విషయాలపై వైఎస్ జగన్ ఆరాతీశారు. రాళ్లపాడు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ రాళ్లపాడు ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. వివరాలు తెలుసుకున్న అనంతరం జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మనుగుంట మహిధర్ రెడ్డికి వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో ఆయన ధర్నా విరమించారు. -
మహీధరుడి సేవాభావం.. పోతుల స్వలాభం
సాక్షి, కందుకూరు (ప్రకాశం): ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థిని ఎంచుకునే బాధ్యత కూడా ఓటర్లపై ఉంది. ఏ పార్టీ అయితే తమకు మేలు చేస్తుంది, ఎవరైతే తమకు అండగా ఉండి తమ సంక్షేమాన్ని, అభివృద్ధికి కృషి చేస్తారని భావిస్తారో వారిని ఎన్నుకోనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గుణగణాలు ఇలా... సుపరిచితం మానుగుంట చరితం ► నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి ప్రజల మేలు కోసం కృషి చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ► దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయ అనుభవం. ► మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్‌రెడ్డి ఒకసారి మంత్రిగాను పనిచేశారు. ► నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు. ► అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు. ► రాజకీయాల్లో ఎంత ఎదిగినా సొంత ఊరిని వదిలని నేతగా గుర్తింపు, ఇప్పటికీ గ్రామంలో సామాన్యుడిగానే నివసిస్తున్నారు. ► సాదారణ రైతు మాదిరి తన వ్యవసాయం తానే చూసుకుంటారు. ► ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయగల నేర్పరి ► ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ► కందుకూరు పట్టణం తాగునీటి సమస్యను పరిష్కరించారే మంచి పేరు ► అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారనే భావన, నమ్మకం ఉన్న నేత. ► నియోజకవర్గంలో శాంతి, భద్రతలను నెలకొల్పడంలో తనదైన ముద్ర వేశారు. ► సమస్యపై ఎవరి వెళ్లినా ముక్కుసూటిగా సమాధానం చెప్పడం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ► ప్రజా సమస్యలపై పోరాడటంలో తెలివైన నేతగా, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో, అభివృద్ధి చేయడంలో బహు ప్రజ్ఞాశాలి ► సంఘ విద్రోహ శక్తులను దరి చేరనీయరు. ► పాలనలో పరాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా అవగాహన, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన నాయకుడు. రాజకీయ అందలం నుంచి పోతుల రామారావు ► సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ► సమీప నియోజకవర్గం కొండపి గ్రామానికి చెందిన నేత. స్థానికుడు కాదు ► రాజకీయాలను వ్యాపార దృక్పధంలోనే వినియోగిస్తారని ఉంది. ► ఎమ్మెల్యేగా నియోజకవర్గం కంటే వ్యాపారాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ► ముభావి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందించని నేతగా గుర్తింపు. ► అధికారంలో ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు సాధించలేదు. ► విషయంలో చురుగ్గా ఉండరనే ముద్ర ► ఎమ్మెల్యేగా ఆయన అధికారంలో ఉన్నా పాలన అంతా ఆయన కుటుంబ సభ్యుల, అనుచరుల చేతుల్లోనే సాగుతుంది, ► సమస్యలపై వెళ్లే ప్రజలు ముందుగా కుటుంబ సభ్యుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి ► వ్యాపారాల నిమిత్తం ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. -
కందుకూరు చూపు.. మానుగుంట వైపు...
సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రెండు కుటుంబాల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అయితే, 2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలను దాటి నియోజకవర్గంలో విజయ పతాకం ఎగురవేసింది. గడిచిన ఐదేళ్లలో ఫ్యాన్ గుర్తుకు కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గంలో ఈసారి ఆ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ నుంచే పోటీచేస్తుండటంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. అంతేగాకుండా ఈ నియోజకవర్గంలో ఆది నుంచీ టీడీపీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీచేసి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి అతనే బరిలో ఉన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పినప్పటికీ ఎలాంటి అభివృద్ధీ చేయకపోగా, తెలుగు తమ్ముళ్ల అవినీతి అక్రమాలకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధులన్నింటినీ పచ్చ నేతలకే దోచిపెట్టారు. వీటన్నింటిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరంగా, అభ్యర్థిపరంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీదే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఓడిపోయిన టీడీపీ.. మానుగుంట కుటుంబానిదే ఆ ఎన్నికల్లో విజయం... కందుకూరు నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, తెలుగుదేశం పార్టీకి కేవలం రెండుసార్లు మాత్రమే విజయం దక్కిందంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో మొదటి నుంచి మానుగుంట–దివి కుటుంబాల మధ్యే రాజకీయం నడుస్తూ వచ్చింది. వారిలో దివి కుటుంబం ఈసారి పోటీలో లేకుండా పోయింది. 1957లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం మొదటిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి దివి కొండయ్యచౌదరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో మొదటిసారి మానుగుంట కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించగా, ఆ ఎన్నికల్లో మానుగుంట ఆదినారాయణరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి 2014 ముందు వరకు మానుగుంట కుటుంబం నియోజకవర్గ రాజకీయాల్లో చెరగని ముద్రవేసింది. 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా కందుకూరులో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలే వీచింది. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మానుగుంట ఆదినారాయణరెడ్డి టీడీపీని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి బరిలో దిగిన ఆదినారాయణరెడ్డి మరోసారి టీడీపీని ఓడించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తండ్రి వారసత్వంగా మొదటిసారి మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో జరిగిన ఎన్నికల్లో దివి కుటుంబం నుంచి తండ్రి కొండయ్యచౌదరి వారసత్వంగా దివి శివరాం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగై ఆ ఎన్నికల్లో మహీధర్‌రెడ్డి పోటీకి దూరంగా ఉండగా, టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు... ఎన్నికల సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ ప్రత్యర్థి, పార్టీ 1952 (ద్విసభ్య) చెంచురామనాయుడు (కాంగ్రెస్) కె.షణ్ముఖం (కాంగ్రెస్) జీవీ సుబ్బయ్య (ఇండిపెండెంట్) సి.కత్తిలింగం (ఇండిపెండెంట్) 1957 దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్) ఆర్.వెంకయ్య (సీపీఐ) 1962 నలమోతు చెంచురామనాయుడు (కాంగ్రెస్) దివి కొండయ్యచౌదరి (ఇండిపెండెంట్) 1967 నలమోతు చెంచురామనాయుడు (కాంగ్రెస్) వీవై కోటారెడ్డి (ఇండిపెండెంట్) 1972 మానుగుంట ఆదినారాయణరెడ్డి (ఇండిపెండెంట్) చెంచురామనాయుడు (కాంగ్రెస్) 1978 దివి కొండయ్యచౌదరి (కాంగ్రెస్.ఐ) మానుగుంట ఆదినారాయణరెడ్డి (జనతా) 1983 మానుగుంట ఆదినారాయణరెడ్డి (ఇండిపెండెంట్) గుత్తా వెంకటసుబ్బయ్య (టీడీపీ) 1985 మానుగుంట ఆదినారాయణరెడ్డి (కాంగ్రెస్) గుత్తా వెంకటసుబ్బయ్య(టీడీపీ) 1989 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) ఎం.మాలకొండయ్య(టీడీపీ) 1994 దివి శివరాం (టీడీపీ) మానుగుంట మహీధర్‌రెడ్డి (ఇండిపెండెంట్) 1999 దివి శివరాం (టీడీపీ) మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) 2004 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) దివి శివరాం (టీడీపీ) 2009 మానుగుంట మహీధర్‌రెడ్డి (కాంగ్రెస్) దివి శివరాం (టీడీపీ) 2014 పోతుల రామారావు (వైఎస్సార్ సీపీ) దివి శివరాం (టీడీపీ) మండలాల వారీగా ఓటర్లు... మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం ఓటర్లు కందుకూరు మున్సిపాలిటీ 21,316 22,072 19 43,388 కందుకూరు మండలం 14,129 14,171 00 28,300 వలేటివారిపాలెం మండలం 16,190 16,208 03 32,401 లింగసముద్రం మండలం 14,516 14,097 02 28,615 గుడ్లూరు మండలం 18,410 18,360 00 36,770 ఉలవపాడు మండలం 20,549 20,263 02 40,814 అంతర్గత పోరుతో టీడీపీ సతమతం... నియోజకవర్గంలో అంతర్గతపోరుతో టీడీపీ సతమతమవుతోంది. 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారడంతో అనాధిగా పార్టీలో కొనసాగుతున్న దివి శివరాం వర్గానికి కంటగింపుగా మారింది. ఈ రెండువర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ తర్వాత అధిష్టానం మాటకు దివి శివరాం తలొగ్గినా ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం పోతుల వర్గంతో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. శివరాం సోదరులైతే పూర్తిగా పోతుల వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దివి కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టిన పోతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సహకరించేది లేదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే శివరాం సోదరుడు దివి లింగయ్యనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు పోతులతో విభేదించి ఏకంగా ఆ పార్టీకే గుడ్‌బై చెబుతున్నారు. దీంతో టీడీపీ డీలాపడగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆ పార్టీ అభ్యర్థి మహీధరరెడ్డి నేతృత్వంలో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్సార్ సీపీ విజయాన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కందుకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా మహిధర్‌రెడ్డి నామినేషన్
-
కులాల మధ్య బాబు చిచ్చు: మానుగుంట
కందుకూరు : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత మానుగుంట మహిధర్ రెడ్డి మండిపడ్డారు. కందుకూరులో మహిధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాబు తన అనుకూల పత్రికల ద్వారా కుహానా రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా నేటికీ మోసపూరిత తీర్మానాలు చేస్తూ కాపులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని కొనియాడారు. జగ్గంపేట సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి కాపులను జగన్‌కు దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 వేల కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఇస్తామని చెప్పి నాలుగున్నర ఏళ్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాపులకు రూ.10 వేల కోట్లు ప్రకటించడం హర్షణీయం అన్నారు. చంద్రబాబు మాయమాటలు కాపు సోదరులు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
నయా జోష్..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తాజాగా పురపాలకశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు రూరల్ మండలాలు, కందుకూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, అనుచరులతో కలిసి మహీధర్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు వెళ్లారు. అనపర్తి నియోజకవర్గం పందలపాకలో పాదయాత్రలో అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఆయనకు, అనుచరులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో కలిసిన మహీధర్‌రెడ్డిని, ఆయన అనుచరులను వైఎస్ జగన్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆయన అనుచరులు ఆయన పార్టీలో చేరే సమయంలో పార్టీ అధినేతకు జేజేలు పలికారు. మహీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడంతో ఆ పార్టీలో మరింత జోష్ నెలకొంది. మహీధర్‌రెడ్డి రాకను జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులుస్వాగతిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ జిల్లాలో మరింత బలోపేతం అయిందని వారు పేర్కొంటున్నారు. ఐదు మండలాల నుంచి కాకినాడకుఅనుచరగణం.. మహీధర్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా మంగళవారం రాత్రికే కందుకూరు నియోజకవర్గం నుంచి పలువురు ఆర్టీసీ బస్సుల్లో కాకినాడ చేరుకున్నారు. మరికొందరు కార్లలో వెళ్లారు. గుడ్లూరు ఎంపీపీ ఐ.శ్రీనివాస్, తోకల కొండయ్య, సర్పంచిలు బత్తిన మదన్ మనోహర్, బూసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, పాలూరి వెంకారెడ్డి, డాక్టర్ ప్రసాద్, రామాల సింగారెడ్డి, చెరుకూరి సూర్యనారాయణ, మునగల మాలకొండారెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, గుత్తా గోపీ, మధు, చీమల శ్రీను, పారా జనార్దన్, జంపని నరసరాజు, కవులూరి మురార్జి, వసంత్, నరసయ్య, వెంకటరావు, చెరుకూరి రాజేంద్రప్రసాద్, మధు, చీమల శ్రీను, సాపల రవణయ్య, సాపల శ్రీనివాస్, కవర్తపు వాసు, దారం మాల్యాద్రి, దారం కృష్ణమనాయుడు, మసూద్, జిలాని, అనుమోలు లక్ష్మీ నరసింహాం, ఉన్నం వీరాస్వామి, పి.శ్రీను, మార్తాల వెంకటేశ్వర్లు, ప్రభా కూనం, వీరయ్య, కర్ల వెంకటరావు, చీమల రాజా, చీమకుర్తి కృష్ణారెడ్డి, యాళ్ల బ్రహ్మారెడ్డి, చుండి సూర్యం, చల్లా మురళీ, వరికూడి కృష్ణారెడ్డి, వీఆర్ కోట నాయుడు, మాజీ కౌన్సిలర్లు చింతలపూడి మోహన్‌రావు, షేక్ ఖాదర్‌బాషా, జాజుల కోటేశ్వరరావు, కరీమూన్, గౌష్‌బాషా, సాదు మాదవ తదితరులు దాదాపు 1,500 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు, నాయకులు వరికూటి కొండారెడ్డి, కేవీ రమణారెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, శేషారెడ్డి, దూళిపూడి ప్రసాద్‌నాయుడు, మిడసల వెంకట విశ్వేశ్వరరావు, గోపీనాథ్, వల్లెపు మురళి, గంటా రామానాయుడు, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, మోహన్‌రావు, కిరణ్, సింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి వ్యూహరచనలో బాలినేని.. జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలు కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు పలువురు ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్ వైఎస్సార్ సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం వైఎస్సార్ సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపారు. వీరితో పాటు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కొందరు ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు సైతం ఇతర పార్టీలో నుంచి వైఎస్సార్ సీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక గ్రామస్థాయిల్లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నిత్యం వైఎస్సార్ సీపీలో చేరుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో వైఎస్సార్ సీపీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి శరవేగంగా పావులు కదుపుతున్నారు. -
రాష్ట్రానికి వైఎస్ జగన్ నాయకత్వం అవసరం
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి
సాక్షి, మండపేట : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిధర్‌రెడ్డి వైఎస్సార్పీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో బుధవారం జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కందుకూరు నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్ రెడ్డిని వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మహిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా సరనే వైఎస్ జగన్‌ను బలపరిచే పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పును, జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తానని జగన్ అంటున్నారని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై వైఎస్సార్సీపీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్దినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మహీధర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీలో చేరికకు సిద్ధమవగా తాజాగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈ నెల 11న మానుగుంట పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని శనివారం తిరుపతిలో ఆయనే స్వయంగా వెల్లడించారు. మహీధర్‌రెడ్డి తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీనేత భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కలిశారు. వారితో కలిసి స్థానిక సాయిబాబా గుడిని సందర్శించారు. అనంతరం అందరి సమక్షంలో తాను వైఎస్సార్ సీపీఈ లో చేరుతున్నట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహీధరరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి కందుకూరు నుంచి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు. 1972 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి పోటీచేసిన ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెంచు రామనాయుడుపై గెలుపొందాడు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండయ్య చౌదరిపై ఓటమి చెందారు. ఆ తరువాత 1983లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకటసుబ్బయ్యపై గెలుపొందారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి మరోమారు గుత్తా పై గెలిచారు. ఆ తరువాత 1989 మహీధరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యపై విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాంను రెండు మార్లు వరుసగా ఓడించి సత్తా చాటారు మానుగుంట. వైఎస్ మృతి అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్లో మున్సిపల్ శాఖామంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఈ నెల 11వ తేదీన జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరవర్గం పెద్ద ఎత్తున పార్టీలో చేరనుంది. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి తదితర నియోజకవర్గాల్లో మహీధరరెడ్డి ప్రభావం ఉంది. ఇది వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశం. దీంతో జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
ప్రజలకు మేలు చేసే పార్టీలో చేరుతున్నా
సాక్షి, తిరుపతి: ‘నా ఇష్టదైవం షిరిడీ సాయినాధుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నాను. పనిచేస్తున్న చేయికి మా చేతులు జోడించాలని భావించాను. ప్రజలకు మేలు చేసే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నియోజకవర్గ ప్రజల కోసం, వారి అభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈనెల 11న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చేరుతున్నాను’ అని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని సాయిబాబ మందిరంలో శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు విజయసాయిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలన అందించారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రారంభించిన పథకాలను కొనసాగించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రజల్లో మేమకమవుతున్నారని తెలిపారు. -
ఒంగోలు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అవసరం
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలంటే వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని గుర్తించినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి ఇటీవల వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలోని కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న భవనాలతో పాటు ధ్వంసమైన డివైడర్లు, పైపులైన్ లీకేజీలను కార్పొరేషన్, విద్యుత్ శాఖాధికారులతో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించి ఒంగోలు నగర అభివృద్ధికి ఏడాదిలోగా బాటలు వేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకం కల్పిస్తూ కోర్టును ఆశ్రయించిన భవనాల యజమానులతో సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు. గోడు వెళ్లబోసుకున్న మహిళలు... కర్నూలు రోడ్డు, తదితర ప్రాంతాల్లో పర్యటించిన జనార్దన్‌ను స్థానిక వెంకటేశ్వరనగర్, మఠంబజార్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలు కలుసుకుని సమస్యలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సాయంత్రంలోగా నీరు సరఫరా చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారు. అదే విధంగా కర్నూలురోడ్డు విస్తరణలో కూలగొట్టిన భవనాలకు సెట్‌బ్యాక్‌కు సంబంధించిన టీడీఎస్ ఫారాలను కార్పొరేషన్ అధికారులు నేటికీ ఇవ్వలేదని వాటి యజమానులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులతో సంబంధం లేకుండానే కూలగొట్టిన భవనాల యజమానులకు వాటిని అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రోడ్డు విస్తరించిన ప్రాంతాల్లో ఇంకా రోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆ శాఖాధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు, కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఎంఈ చెన్నకేశవరెడ్డి, పర్యావరణ డీఈ గిరిధర్ తదితరులు ఉన్నారు. -
ప్యాకేజీలతో నాయకులకు వల
ఉలవపాడు, న్యూస్‌లైన్ : నాయకులంటే కార్యకర్తలకు అండగా ఉండాలి. వారి సమస్యలు పరిష్కరిస్తూ నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. కానీ, ప్రస్తుత నేతలు తమ వద్ద ఉన్న నాయకులు, కార్యకర్తలను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారు. ఉలవపాడు మండలంలోని ఇలాంటి నాయకుల తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మానుగుంట మహీధర్‌రెడ్డి కూడా ఆ పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అయోమయంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల కోసం టీడీపీ నేతలు వేట ప్రారంభించారు. టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గంగా మారి ఆ పార్టీలో చేరాలని, అలాచేస్తే ప్యాకేజీలు ఇప్పిస్తామని కొందరు టీడీపీ నాయకులు.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా టీడీపీ నేత దివి శివరాంకు వ్యతిరేకంగా పనిచేసినందున.. ఆయనతో సంబంధం లేకుండా నేరుగా కావలి వెళ్లి ఆదాల ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్యాకేజీల కోసం కావలి, కందుకూరు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి వారికి వద్ద ఉన్న కార్యకర్తలకు ఏమీ అర్థం కావడం లేదు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసం నాయకులు ఎగబడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము ఏ పార్టీలోకీ రామని తెగేసి చెబుతున్నారు. కానీ, కందుకూరు నియోజకవర్గంలో మంచి ఊపుమీదున్న వైఎస్ఆర్ సీపీని తట్టుకోవాలంటే తటస్థంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకు వల వెయ్యాలని టీడీపీ నాయకులు నానాకష్టాలు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ప్యాకేజీలు ఇవ్వని శివరాం కూడా ఇప్పుడు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎటూకాకుండా పోయిన దాదాపు 20 మంది కాంగ్రెస్ నాయకులను ఆదాల అనుచరులు కలిసి ప్యాకేజీలు ప్రకటించారు. ఈ ప్యాకేజీలకు కొందరు సుముఖత వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం అధిక మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. 100 ఓట్లున్న ఓ నాయకునికి 50 వేల రూపాయలు ఆఫర్ చేయగా.. ఆ నాయకుడు లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గమనించిన కార్యకర్తలు, ప్రజలు తమ నాయకులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తమను అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు పుచ్చుకుంటున్న వారివెంట వెళ్లేది లేదని వారంతా స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ప్యాకేజీలు మాట్లాడుకున్న కొందరు నేతలు.. తమ వెనుక ఎవరూ రాకపోతుండటంతో తలలు పట్టుకుని కూర్చున్నారు. -
పైసలిస్తేనే పట్టాలా?
పట్టాల పంపిణీలో అవకతవకలున్నాయని జనం ఆగ్రహం ముఖం చాటేసిన మంత్రి మహీధర రెడ్డి,ఎంపీ మాగుంట ఒంగోలులోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణం శనివారం ఉదయం పేదల ఆగ్రహ జ్వాలలతో అట్టుడికిపోయింది. నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇంటి పట్టాల జాబితాలో అవకతవకలున్నాయని జనం తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులు, డబ్బులిచ్చిన వారి పేర్లనే రెవెన్యూ సిబ్బంది జాబితాలో చేర్చారని నిలదీశారు. దీంతో పట్టాలు పంపిణీ చేయాల్సిన మంత్రి మహీధర రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈ విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి రాకుండా ముఖం చాటేశారు. ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : నగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టగా అది రసాభాసగా మారింది. నగరంలో అర్హులకు నివేశన స్థలాలు పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. తీరా జాబితాలో అర్హుల పేర్లు మాయం కావడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి, ఎంపీలు తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా ముఖం చాటేశారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు తాము బలయ్యామని మహిళలు ఉగ్రరూపం దాల్చారు. ఆర్ఐ, ఇద్దరు వీఆర్వోలు చేతివాటం చూపి ఇష్టానుసారంగా జాబితా తయారు చేశారని అర్హులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలరాం కాలనీ, పాపా కాలనీ, గోపాలనగరం, సంతపేట, రామ్‌నగర్, ఇస్లాంపేట, రిక్షాబజారు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పేర్లు నివేశన స్థలాల జాబితాలో లేవు. అర్హులకు ఎందుకు పట్టాలు మంజూరు చేయలేదని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలను పోలీసులు అక్కడి నుంచి పక్కకు పంపివేశారు. మంత్రి, ఎంపీ కోసం ఎదురు చూసిన మహిళలు పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి, ఎంపీలు వస్తారని, వారినే నిలదీద్దామని బాధిత మహిళలు కోసం ఎదురు చూశారు. మధ్యాహ్నం వరకూ ఒకరు కూడా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు సీపీఎం నేతలు అక్కడకు వచ్చారు. పట్టాల పంపిణీకి సిద్ధం చేసిన జాబితా తప్పుల తడకగా ఉందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే పట్టాలివ్వాలని ప్లకార్డులు పట్టుకుని బైఠాయించారు. ఇంతలో పట్టాల పంపీణీ వాయిదా వేస్తున్నట్లు తహసీల్దార్ ప్రకటించారు. జాబితాలో పేర్లున్న వారు సంబంధిత పత్రాలు, భార్యాభర్తల ఫొటోలతో కార్యాలయంలో సంప్రందించి పట్టాలు పొందొచ్చని చెప్పటంపై అర్హులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికే పట్టాలు : కొప్పులగడ్డ లక్ష్మి, బలరాం కాలనీ తహసీల్దార్, ఆయన కార్యాలయ సిబ్బంది డబ్బులు తీసుకుని అనర్హులైన ఉన్నత వర్గాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆరేళ్ల నుంచి కాళ్లరిగేలా తిరిగినా అర్హులకు అన్యాయం జరిగింది. దయచేసి పునఃపరిశీలించి అర్హులకు మాత్రమే స్థలాలివ్వాలి. అనర్హుల పట్టాలు రద్దు చేయాలి: కాకర్లపూడి మాధవి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురికి కూడా పట్టాలిచ్చారు. అంతేకాకుండా సంపన్న కుటుంబాలకు చెందినవారూ పట్టాలు పొందారు. అలాంటి అనర్హుల పట్టాలు రద్దు చేసి నిజమైన పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి. తహసీల్దార్ ఏమన్నారంటే.. అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు చెప్పారు. జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని, ఆ జాబితాలో కొందరు ఆరోపిస్తున్నట్లు అనర్హులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. అది నిజమైతే పట్టాలు రద్దుచేసి అర్హులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు పరిధిలో నివేశ స్థలాల కోసం మొత్తం 18 వేల దరఖాస్తులు వచ్చాయని, నాలుగు వేల మందిని అర్హులుగా గుర్తించినా సరిపడా స్థలం లేదని తహసీల్దార్ పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ వెతలు
ఎదుగూ బొదుగూ లేని పారిశుధ్య కార్మికులు దారిద్య్రం తాండవిస్తున్నా కనికరింపు లేదు కాంట్రాక్టు సంగతి సరే... కనీసం పర్మినెంట్ వారికీ దిక్కులేదు మహిళా కార్మికుల అవస్థలు మరింత వర్ణనాతీతం ఊరు నిద్ర లేవకముందే...తట్టా, చీపురు చేతపట్టి వీధుల్లోకొచ్చి వెలుగు రేఖలు విచ్చుకునే సరికల్లా అడుగడుగూ శుభ్రపరిచే పారిశుధ్య కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. మహిళా కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఒక వారం రోజులపాటు వారంతా విధులకు స్వస్తి చెప్తే తెలుస్తుంది వారి ప్రాధాన్యత ఎంతో. నగరపాలక సంస్థ, నగర పంచాయతీలు, పంచాయతీలు ఏవైనా సరే పారిశుధ్య కార్మికులు అత్యంత అవసరం. జిల్లాలోని మహిళా పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘న్యూస్‌లైన్’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. - న్యూస్‌లైన్, ఒంగోలు ఒంగోలు నగరంతో పాటు, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలు, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి నగర పంచాయతీలు, 55 మేజర్ పంచాయతీలు, మరికొన్ని మైనర్ పంచాయతీల్లోనూ పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా జీతాలు చెల్లిస్తున్నారు. పొన్నలూరులో నెలకు రూ.3 వేలు, సింగరాయకొండలో రూ.5,100, టంగుటూరులో రూ.6 వేలు ఇలా..ఇష్టారీతిగా జీతాలిస్తున్నారు. నగర పాలక, పురపాలక సంఘాల్లో ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు కార్మికులుండగా అందులోనూ 40 శాతం మంది మహిళా కార్మికులు కావడంతో వారి సంక్షేమం తమకు పట్టదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాంలు, కొబ్బరినూనె, సబ్బులు, 2 జతల చెప్పులు ఇవ్వాలి. అయితే ఒంగోలు, చీరాల మినహా ఎక్కడా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి పంపిణీ చేయలేదు. పారిశుధ్య కార్మికుల చేతులకు గ్లౌజులు కూడా పంపిణీ చేయడం లేదు. ఒంగోలు, చీరాల వంటి చోట్ల అర్ధరాత్రిళ్లు సైతం వారిని విధులకు పిలుస్తున్నారు. ఆ సమయంలో వారి అవస్థలు వర్ణనాతీతం. రాత్రిపూట, వేకువజామున రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు పంపిణీ చేయాలి. ఒంగోలులోనే కొందరికి లేవు. మున్సిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు కనీసం తట్టలు, బుట్టలు సైతం లేకపోవడం గమనార్హం. దుస్తులు, చెప్పులు, బూట్లు పర్మినెంట్ కార్మికులకు ఇస్తుండగా కాంట్రాక్టు కార్మికులకు అవీ లేవు. జీతాల విషయంలోనూ తేడాలు చూపుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,750 ఇస్తున్నారు. అయితే వాటిలో ఈఎస్సై, పీఎఫ్ కట్ చేస్తుండటంతో చేతికొచ్చేది రూ.5 వేలు మాత్రమే. అది కూడా చాలా చోట్ల సక్రమంగా ఇవ్వడం లేదు. టంగుటూరు పంచాయతీలో 5 నెలల జీతం పెండింగ్‌లో ఉండిపోయింది. ఒంగోలు నగరపాలక సంస్థలో పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు ఆగిపోయాయి. అందని వైద్యసేవలు: నిత్యం దుమ్ముధూళిలో, అపరిశుభ్రత నడుమ పనిచేసే పారిశుధ్య కార్మికులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారికి కనీసం వైద్యసేవలు అందడం లేదు. జిల్లాలో ఈఎస్సై ఆస్పత్రి లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈఎస్సై సేవలు పొందేందుకు ప్రతినెలా జీతంలో కోత పడుతున్నా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించక తప్పడం లేదు. తమకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని మహిళా పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరుతున్నారు. ఇక పంచాయతీ ఉద్యోగులకు కూడా 010 హెడ్ కింద జీతాలు వారి అకౌంట్లో పడకపోవడం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.8750 ఇవ్వాలని జీవో ఉన్నా ప్రభుత్వమే అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్సై ఆస్పత్రి అవసరం : ధనలక్ష్మి, ఒంగోలు ఈఎస్సై పేరుతో ప్రతినెలా జీతాల నుంచి కోతపడుతోంది. కానీ విజయవాడలాంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాలంటే కుదిరేపనికాదు. ఒంగోలులో ఈఎస్సై ఆస్పత్రిని ప్రభుత్వం మంజూరు చేయాలి. అప్పటి వరకు కనీసం చిన్న డిస్పెన్సరీని అయినా ఏర్పాటు చేయాలి. అలా చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది. మా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు పోట్లూరి సుబ్బులు, వలపర్ల. పారిశుధ్య కార్మికుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పని ఎక్కువగా ఉంటుంది. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. నెలకు రూ.100 నుంచి పనిచేశాను: మేకల అంజమ్మ, తాళ్లూరు 30 ఏళ్ల నుంచి తాళ్లూరు పంచాయతీలో రోడ్డు చిమ్ముతున్నారు. నెలకు వంద రూపాయల నుంచి పనిచేశాను. ప్రస్తుతం వెయ్యి రూపాయలిస్తున్నారు. ఉదయం మూడు గంటలకు రోడ్లు చిమ్ముతాను. మళ్లీ 9 గంటల నుంచి ఆఫీస్ పనిచేస్తాను. అందుకుగాను రూ.500 ఇస్తారు. అరకొర జీతంతో అవస్థ పడుతున్నా. నాలుగు నెలల జీతాలు రావాలి : మంచాల అంకాళమ్మ, యర్రగొండపాలెం మాకు నాలుగు నెలల జీతాలు రావాలి. జీతాలు రాక పోవడంతో కిరాణా కొట్లో అప్పు కూడా ఇవ్వమంటున్నారు. రోజు కూలీ పైనే ఆధారపడి ఉన్నాం. మా జీతాలు సక్రమంగా వచ్చేలా చూడాలి. -
‘న్యూ’ కలెక్టరేట్ కాంప్లెక్స్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రకాశంభవనం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ ఒకేచోటికి రానున్నాయి. ప్రకాశంభవనంతో పాటు దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో 8 అంతస్తుల చొప్పున రెండు భవనాలు నిర్మించేందుకు ప్లాన్ సిద్ధమైంది. 750 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాలును కూడా డిజైన్ చేశారు. రెండు బ్లాక్‌లను కలుపుతూ అండర్ గ్రౌండ్ సబ్వే, ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఇందు కోసం 105 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కలెక్టర్ విజయకుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మున్సిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధరరెడ్డిల దృష్టికి న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్ విషయాన్ని కలెక్టర్ తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చూస్తానని ఇద్దరు మంత్రులూ హామీఇచ్చారు. న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు నిధులు మంజూరైతే వెంటనే నిర్మాణ పనులు చేపట్టి జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్దేలా రూపకల్పన చేస్తున్నారు. సోలార్ టవర్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టం... కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మనున్నాయి. కాంప్లెక్స్‌పై సోలార్ టవర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి పడిపోయి సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలిగే అవకాశాలుండటంతో ముందు జాగ్రత్తగా సోలార్ టవర్స్‌కు డిజైన్ చేశారు. సోలార్ టవర్స్ వల్ల నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలున్నాయి. కీలకమైన సమావేశాలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా సోలార్ టవర్స్ ద్వారా పునరుత్పత్తి చేసి ఎలాంటి ఆటంకం లేకుండా సమావేశాలు జరిగేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రకాశంభవనంతో పాటు దానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను కలుపుతూ నిర్మాణాలు పూర్తయిన తర్వాత మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. కష్టాలకు చెక్... న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మిస్తే అధికారులు, ఉద్యోగులతో పాటు ప్రజల కష్టాలు కూడా తీరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రకాశంభవనం శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబు, గోడల నుంచి పెచ్చులూడి పడుతుండటంతో అధికారులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయాల్లో ప్రాణాలు అరచేత పట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. పైఅంతస్తు కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్న అధికారులు, సిబ్బంది, ప్రజలపై కూడా పెచ్చులూడిపడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రకాశంభవనం పైఅంతస్తు శ్లాబ్‌కు మరమ్మతులు కూడా చేశారు. అయినప్పటికీ తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత ప్రయోజనాలు లేకుండా పోయాయి. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కూడా కార్యాలయాలకు అనుకూలంగా లేదు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన భవనం కావడంతో కార్యాలయాల నిర్వహణకు గదులు సౌకర్యంగా లేవు. అది కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనులపై వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భవన సముదాయంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి నిరుపయోగంగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కలెక్టర్ విజయకుమార్ న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇండియా గేట్ మోడల్లో ఉన్న కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తే నగరానికే సరికొత్త అందం వస్తుంది. -
భారీ వర్షం: ప్రాథమిక నష్టం అంచనా.. 770 కోట్ల పైనే
ఒంగోలు, న్యూస్‌లైన్ : భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. ప్రాథమికంగా నష్టం అంచనా రూ.770 కోట్లకుపైమాటేనని అధికారులు తేల్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనం మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. వేలాది నివాస గృహాలు, పదుల సంఖ్యలో కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ముంపు గ్రామాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్, రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిలు శనివారం జిల్లాకు వస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. కూలీలు సురక్షితం గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. యర్రగొండపాలెంలో పశువులమేత కోసం వెళ్లి దాదాపు 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. తీగలేరు, దొంగలవాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపి సమీపంలోని ముసి వాగు అవతల చిక్కుకున్న 300 మంది రాజమండ్రికి చెందిన కూలీలు, మరో 100 మంది కొండపికి చెందిన కూలీలను అధికారులు మరబోట్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. దీని కోసం పాకల సముద్ర తీరం నుంచి బోట్లు తెప్పించారు. జరుగుమల్లి మండలం సాదువారిపాలెం శుక్రవారం రాత్రికి కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. చీరాలలో 5 వేల చేనేత గృహాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 150 ఇళ్లు కూలిపోయాయి, 14 గేదెలు, 15 గొర్రెలు చనిపోయాయి. చీరాల ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్కు గండిపడటంతో సమీపంలోని సవరపాలెం బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. కొత్తపట్నం మార్గంలో ఉప్పువాగు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కందుకూరు ప్రాంతంలో కాలనీల్లో చేరిన నీటిని బయటకు పంపలేదు. ఒంగోలులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచే ఉంది. పర్చూరు ప్రాంతంలో కాలనీల్లో చిక్కుకున్న నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. దేవరపాలెం క్రాస్‌రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో 14 వేల ఎకరాలు నీటమునిగాయి. కాకర్ల డ్యామ్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ఆర్టీసీ అధికారులు శుక్రవారం దాదాపు 30 సర్వీసులను తిప్పలేదు. ప్రధానంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు విపరీతంగా వస్తుండటంతో 9 గేట్లు తెరిచారు. ప్రాథమిక నష్టం అంచనా వివరాలు.. జిల్లాకు మంత్రులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక అంచనాలను తయారు చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు రూ. 770 కోట్లకుగాపైగా జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీకి చెందిన 30.106 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, దానికోసం రూ. 97.15 కోట్లు అవసరమవుతాయని నివేదించనున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో మరమ్మతులకు రూ. 229.21 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. -
మాటల మాంత్రికుని హామీకి రెండేళ్లు
కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదని తేలిపోయింది. సొంత నియోజకవర్గం కందుకూరు పట్టణ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు శూన్యం. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలతో పాటు కందుకూరు మున్సిపాలిటీని కూడా ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన కింద చేర్చింది. అంటే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారన్నమాట. మురికివాడలన్నీ అభివృద్ధి చేస్తామన్న మంత్రి మాటలు పత్రికల్లో తూటాల్లా పేలాయి. ఆ తూటాలకు భయపడిన అధికారులు *లక్షలు ఖర్చుచేసి ప్రతిపాదనలు పంపారు. మాటల మాంత్రీకుడు నేటికీ ఆ పథకం తీరుతెన్నులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు మంత్రిని మాటల మరాఠీగా అభివర్ణిస్తున్నారు. హామీకి రెండేళ్లుకందుకూరు మున్సిపాలిటీకి రాజీవ్ ఆవాస్ యోజన మంజూరైనట్లు రెండేళ్ల క్రితం మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్యారా మురికి వాడలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మురికి వాడల్లో రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రలు నిర్మిస్తామని చెప్పారు. పట్టణంలో గూడులేని పేదవారిని గుర్తించి ఇళ్లు నిర్మించుకునేందుకు సుమారు * 3.50 లక్షలు చొప్పున ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభత్వం 30 శాతం, లబ్ధిదారుడు 20 శాతం భరించాలన్నది ఈ పథకం ఉద్దేశం. దీంతో గూడులేని పేదలు, పట్టణ ప్రజలు సంతోషించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని మున్సిపాలిటీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు పట్టణంలోని 26 వార్డుల్లో మురికి వాడలను గుర్తించి విడతల వారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ ప్రైవేటు సంస్థ ద్వారా శాటిలైట్ సర్వే చేయించి సమగ్ర నివేదికను తయరు చేశారు. ఇందుకోసం మున్పిపాలిటీ * 6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతగా ఒకటో వార్డును ఎంపిక చేశారు. ఈ వార్డులో 156 మందికి గృహాలు నిర్మించాలని, డ్రెయిన్లు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేయాలని ఇందుకు * 36 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్ పంపారు. అక్కడ అనుమతి పొందితే ప్రతిపాదనలు ఢిల్లీ కూడా పంపాల్సి ఉంది. సంబంధిత ఫైలు హైదరాబాద్ చేరినా మంత్రి పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమార్ను ‘న్యూస్‌లైన్’వివరణ కోరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.